అమెరికాలో మనోళ్లు ఐక్యంగా ఉండాలి

3

– ‘ఆట’ సభ్యులకు సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌,మార్చి21(జనంసాక్షి):ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏటీఏ(అటా) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ప్రెసిడెంట్‌ సుధాకర్‌ పెర్కారీ, ట్రస్ట్‌ మెంబర్‌ లక్ష్మణ్‌ అనుగు కలిశారు. జులై 1 నుంచి 3 వరకు చికాగోలో జరిగే అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ 14వ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరవ్వాలని సీఎంకు వారు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అమెరికాలో ఉండే తెలంగాణ వారి ఆర్థిక స్థితిగతులు, ఇతర పరిస్థితులపై ఆరా తీశారు. తెలంగాణ బిడ్డలు సంఘాల పేరుతో విడిపోకుండా సమైక్యంగా ఉండాలని సీఎం కోరారు.  అమెరికా వెళ్లిన తెలంగాణ వారు చాలా కొద్ది కాలంలోనే బాగా ఎదిగారని, 60 నుంచి 70 వేల అమెరికన్‌ డాలర్ల తలసరి ఆదాయం కలిగి ఉన్నారని అటా ప్రతినిధులు సీఎంకు వివరించారు. అమెరికాలోని తెలంగాణ వారు చాలా మంది మంచి స్థాయిలో ఉండటం ఆనందంగా ఉందన్నారు సీఎం. చెత్త సేకరణకు, పారిశుద్ధ్య నిర్వహణకు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడానికి అక్కడి ప్రభుత్వాలు అనుసరిస్తున్న పద్ధతులను సీఎం అడిగి తెలుసుకున్నారు.