అమెరికా ప్రతినిధి బృందంలో మంత్రి కేటీఆర్‌ భేటీ

5

హైదరాబాద్‌,మార్చి17(జనంసాక్షి): భారత దేశంలో అమెరికన్‌ పెట్టుబడులు, టెక్నాలజీ సంస్ధల ప్రమెషన్‌ కోసం రోడ్‌ షో నిర్వహిస్తున్న అమెరికా ప్రభుత్వ అసిస్టెంట్‌ సెక్రటరీ ఫర్‌ ఏకానిమిక్స్‌ , బిజినెస్‌ , చార్లెస్‌ రివికిన్‌  తెలంగాణ ఐటి మున్సిపల్‌ శాఖ మంత్రి కె.తారక రామారావుని కలిసారు. అమెరికా హైదరాబాద్‌ కాన్సుల్‌ జనరల్‌ మైకెల్‌ మలిన్స్‌ తోపాటు అమెరికాకి చెందిన సూమారు 25 కంపెనీల ప్రతినిధులు మంత్రితో సమావేశంలో పాల్గోన్నారు. ఈ అమెరికా ప్రతినిధి బృందం ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో పర్యటించి వచ్చినట్లు, అయితే తెలంగాణలోని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల గురించి తెలుసుకున్న తర్వతా అమెరికా కంపెనీలు కోరుకుంటున్న వాతావరణం  ఉన్నట్లు అమెరికా అసిస్టెంట్‌ సెక్రటరీ రివ్‌ కిన్‌ తెలిపారు. ముఖ్యంగా తినినినీలజీబితినీని జీనిట ఞశ్రీవజీనిబివఞష్ట్ర ల విూద దృష్టి సారించినట్లు  రివికిన్‌ తెలిపారు. దేశంలోనే అత్యదిక అర్భన్‌ ఏరియాప్రాంతం ఉన్నరాష్ట్రాల్లో ఓకటైన తెలంగాణ ఈ అంశంలో అనేక అవకాశాలు కల్పిస్తుందని మంత్రి కెటిరామారావు తెలిపారు. ముఖ్యంగా ఇక్కడి పారిశ్రామిక విధానంలో ఉన్న అనేక వినూత్న అంశాలు( సెల్ప్‌ సర్టిఫీకేషన్‌, అధికారుల ఫీనలైజేషన్‌ వంటి ) అంశాలను వివరించగా ఇలాంటి పాలసీని తాము ఎక్కడాచూడలేదన్నారు. అమెరికాలో జరిగే సమావేశాల్లో తెలంగాణ గురించి ఖఛ్చితంగా ప్రస్తావిస్తామని రివ్‌ కిన్‌ మంత్రికి తెలిపారు. క్లీన్‌ టెక్నాలజీ రంగంలో మూసి నదితోపాటు నగరంలోని చెరువుల పునరుద్దరన, పారిశ్రామిక వ్యర్ధ్య జలాలు పునర్వినియోగం వంటి అంశాల్లో అమెరికన్‌ సంస్ధలతో భాగసామ్యం ఏర్పరుచుకనేందుకు తమ ప్రభుత్వం సిధ్దంగా ఉందని తెలిపారు. ఇందుకోసం ముందుకు వచ్చే అన్ని కంపెనీలకి ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు.ఈ సమావేశంలో మంత్రితోపాటు ఐటి శాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌ ఉన్నారు.