అర్హులందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు

ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ
నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి
శివ్వంపేట సెప్టెంబర్ 23 జనంసాక్షి : ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగ బతుకమ్మ పండుగని మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబం గా నిలిచే ఈ బతుకమ్మ పండుగను మహిళలు సంతోషంగా జరుపుకోవాలని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన రెడ్డి పిలుపునిచ్చారు.  శుక్రవారం ఆయన మండల పరిధిలోని దంతాన్ పల్లి, కొంతాన్ పల్లి, గుండ్లపల్లి, దొంతి, శబాష్ పల్లి గ్రామాలలో మండల ప్రజా ప్రతినిధులతో కలిసి పర్యటించి బతుకమ్మ పండగ కానుక గా ప్రభుత్వం నుంచి వచ్చిన బతుకమ్మ చీరలను మదన్ రెడ్డి మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని చేర్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రోహిణి కార్తె వచ్చిందంటే రైతులు పంటలు వేసుకోవాలంటే చేతిలో చిల్లి గవ్వ లేకపోతే శావుకార్ల వద్దకు,బంగారం తాకట్టు పెట్టి పంటలు వేసేవారని కానీ 14 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఇబ్బందులు రైతులు పడకూడదనే ఉద్దేశ్యంతో పంట పెట్టుబడి సాయం కింద ఎకరాకు పది వేల చొప్పున రెండు పంటలకు అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. దసరా పండుగ తర్వాత ప్రతి గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఎవరి స్థలంలో వారు ఇల్లు కట్టుకునేందుకు 3 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. శభాష్ పల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం వద్ద గల విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్  ను అక్కడి నుంచి వేరే చోటికి తరలించాలని సర్పంచ్ రంగపల్లి పార్వతి సత్యం విన్నపం మేరకు ట్రాన్స్ ఫార్మర్ ను మార్చాలని  ఏఈ దుర్గాప్రసాద్ ను ఫోన్ లో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ, జెడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త, తహశీల్దార్ శ్రీనివాస్ చారి, జిల్లా గ్రంధాలయ ఛైర్మెన్ చంద్రాగౌడ్, జెడ్పీ కో ఆప్షన్ మెంబర్ మన్సూర్, పీఏసీఎస్ చైర్మన్ చింతల వెంకట్రామిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ గొర్రె వెంకట్ రెడ్డి, ఇంచార్జీ ఎంపిడిఓ తిరుపతి రెడ్డి, సర్పంచులు కన్నారం దుర్గేశ్, శ్రీనివాస్ గౌడ్, పెంజర్ల శ్రీనివాస్ యాదవ్, ఫణి శశాంక్ శర్మ, పత్రాల శ్రీనివాస్ గౌడ్, బాబురావు, పిట్ల సత్యనారాయణ, ఎంపీటీసీలు ఆకుల ఇందిరా శ్రీనివాస్, లక్ష్మీ కుమార్,లక్ష్మీ లక్ష్మణ్, ఉప సర్పంచులు మోలుగు నాగేశ్వరరావు, వంచ శోభ, సత్యనారాయణ,పద్మ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Attachments area