అవసరాలకు లోటు రాకుండా ఇసుక సరఫరా

నిజామాబాద్‌,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ):  వ్యక్తిగత అవసలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరాకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు.  జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం  సందర్భంగా ఆయన పరిస్థితిని సవిూక్షించారు. ఇసుక అక్రమ రవాణా జరక్కుండా చూడడాలని, అలాగే అవసరాలకు కొరత లేకుండా చూసుకోవాలన్నారు. బోధన్‌ మండలం పెగడాపల్లి ప్రభుత్వ క్వారీ, మెండోరా మండలం పొతంగల్‌లోని నాలుగు పట్టా భూముల్లో ఇసుక తీసేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రజల వ్యక్తిగత అవసరాలు, ప్రభుత్వ ప్రాధాన్యతా రంగాలు, అభివృద్ధి కార్యక్రమాలకు ఇసుక సరఫరా లో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వ నియమ, నిబంధనలు అమలుచేయాలని అన్నారు.  అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.