అవినీతినీ అంతమొందించడమే బీజేపీ లక్ష్యం
స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 01, ( జనం సాక్షి) : టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతినీ అంత మొందించడమే బీజేపీ లక్ష్యమని బీజేపీ నియోజ కవర్గ ఇంచార్జీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకుడు బొజ్జపెల్లి సుభాష్అన్నారు.టీఆర్ఎస్ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలన నుంచి విముక్తి కోసం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర యాదా ద్రి బహిరంగ సభకు స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రము నుండి, చిల్పుర్,జఫర్ ఘడ్, మండలం నుండి బయలదేరిన వాహనాలను బిజెపి రాష్ట్ర నాయకుడు బొజ్జపళ్లి సుభాష్ నియోజకవర్గ ఇంచార్జ్ పెరమండ్ల వెంకటేశ్వర్లు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి పెరిగి పోయిందని అన్నారు.రాష్ట్రంలో బీజేపీ పార్టీ ని అధికారంలోకి తేవడానికి బండీ సంజయ్ మహా సంగ్రామ యాత్ర చేపట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకుడు ఇను గాల యుగేందర్ రెడ్డి, నాయకులు అంజిరెడ్డి, పుండ్రు నవీన్ రెడ్డి, మదు నాయక్, నునావత్ రాజు నాయక్,తదితరులు పాల్గొన్నారు.