అవి ఆత్మబలిదానాలు కావు
కాంగ్రెస్ హత్యలే : నాగం
హైదరాబాద్, జనవరి 29 (జనంసాక్షి):
ఆత్మబలిదానాలతో తెలంగాణ రాదని తేలిపోయిందని రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే నాగం జనార్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం సచివాలయంలో విూడియాతో మాట్లాడుతూ మొన్న ఆజాద్ ప్రకటనతో ఒకరు గుండె ఆగిచస్తే ఒకరు రైలు కింద పండి ఆత్మహత్య చేసుకోగా ఒకరు చావు బతుకుల మద్య కొట్టు మిట్టాడు తున్నాడన్నారు. ఈ ఆత్మ హత్య లన్నింటిని కాంగ్రెస్ పార్టీ హత్య లుగా బావించాలన్నారు. ఇంత జరిగాక కూడా తెలంగాణ మంత్రు ల్లో చలనం లేదని వారిలొ ఏ మాత్రం చీము నెత్తురు , మానవత్వం ఉంటె వెంటనే రాజీనామా చేసి రాష్ట్ర ఏర్పాటు కోసం ప్నజల్లోకి వచ్చి ఉద్యమించాలని డిమాండ్ చేశారు. వెంటనే తెలంగాణాకు చెందిన మంత్రుల, ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ౖ కేంద్ర ం మంత్రి షిండే సీఎం, పిసిసి అధ్యక్షుడు బొత్సతో చర్చించాలనడం హాస్యాప్పదంగా ఉందన్నారు. ఇద్దరు సమైక్యవాదులని, మొన్న ఉండవల్లి సభలో బొత్స పాల్గొన్ని తన సమైఖ్య వాదాన్ని చాటుకున్నారన్నారు. సీఎం కనుసైగల్లో నేడు సమైక్య ఉద్యమ ం సాగుతుందని ఇలాంటప్పుడు సమైఖ్యవాదులతో చర్చలేమిటని ప్రశ్నించారు. తెలంగాణ సెగ కాంగ్రెస్ అధిష్టానానికి తాకితే గాని స్పందించరన్నారు. మంత్రులు, ఎంపీలు రాజీనామాలు చేసి వేడి పుట్టించాలని నాగం డిమాండ్ చేశారు.