అసెంబ్లీ కమిటీ అధ్యక్షునిగా సునీల్
విజయనగరం, జూలై 13 (: పార్వతీపురం, అరకు పార్లమెంటరీ పరిధిలో నిర్వహించిన యువజన కాంగ్రెస్ కార్యవర్గ ఎన్నికలలో పట్టణానికి సయ్యద్ ఇబ్రహీం హుస్సేన్(సునీల్) స్థానిక అసెంబ్లీ కమిటీకి ఎంపికయ్యారు. పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులుగా కురుపాంకు చెందిన కె. రంజిత్‌కుమార్ గెలిచారు. సునీల్ గతంలో స్థానిక మున్సిపల్ పాలకవర్గం కోఆప్షన్ సభ్యునిగా వ్యవహరించారు. ఆయన ఎన్నికపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.