అసెంబ్లీ @ 78 గంటల 54 నిమిషాలు

5

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి): అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ముగిశాయి. మొత్తం 14 రోజులు సమావేశాలు సాగాయి. ఈ కాలంలో 78 గంటల 54 నిమిషాలు పాటు సభ నిర్వహించారు. ఇందులో టీఆర్‌ఎస్‌ సభ్యులు 36 గంటల 5 నిమిషాలు, కాంగ్రెస్‌ 18 గంటల 34 నిమిషాలు, టీడీపీ 10 నిమిషాలు, ఎంఐఎం 7 గంటల 17 నిమిషాలు, బీజేపీ 9 గంటలు, వైసీపీ 1 గంట 27 నిమిషాలు, సీపీఐ 3 గంటల 27 నిమిషాలు, సీపీఎం 2 గంటల 53 నిమిషాలు, ఇండిపెండెంట్స్‌ 5 నిమిషాలు మాట్లాడారు. మొత్తం 88 మంది సభ్యులు వివిధ అంశాలపై అసెంబ్లీలో మాట్లాడారు.

ఇందులో సభా నాయకుడు (ముఖ్యమంత్రి) 3 గంటల 50 నిమిషాలు మాట్లాడారు. సభ్యుల ప్రశంసలు, పలు అంశాలపై సమాధానాలు

ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకుడు జానారెడ్డి 3 గంటల 24 నిమిషాలు, ఎంఐఎం ఫ్లోర్‌ లీడర్‌ 5 గంటల 19 నిమిషాలు, బీజేపీ నాయకుడు 3 గంటల 59 నిమిషాలు, వైసీపీ నేత 1 గంటల 22 నిమిషాలు, సీపీఐ పక్ష నాయకుడు 3 గంటల 27 నిమిషాలు, సీపీఎం నేత 2 గంటల 53 నిమిషాలు మాట్లాడారు.

అసెంబ్లీ బడ్దెట్‌ సమావేశాల్లో ప్రభుత్వం 8 బిల్లులు ప్రవేశపెడితే 7 బిల్లులు ఆమోదం పొందాయి.

సీఎం సహా మంత్రులు విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు,