అసోంపై మోదీ సర్కారు వివక్ష

1

– సోనియా

జోరుగా సోనియా ఎన్నికల ప్రచారం

మోరిగాన్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి): అసోంలోని మోరిగాన్‌ జిల్లాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పాల్గొన్నారు. ప్రత్యేక విమానంలో వచ్చిన ఆమెకు పార్టీ కార్యకర్తలు, ప్రజలు సాదర స్వాగతం పలికారు. అసోంలో రెండో దశ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తన ప్రాబల్యాన్ని చూపడానికి ఎక్కువగా ప్రచార సభలను ఏర్పాటు చేస్తుంది. ఎండను సైతం లెక్క చేయకుండా ఈ కార్యక్రమానికి ప్రజలు భారీగా హాజరయ్యారు. మరో నాలుగు రోజుల్లో అసోంలో రెండో దశ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది.

ఈ నెల నాలుగో తేదీన జరిగిన తొలి దశ పోలింగ్‌లో ప్రజలందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 70శాతం పోలింగ్‌ నమోదయ్యింది.

అసోం అభివృద్ధికి కేంద్రం నిధులివ్వడం లేదు

అస్సాంలో ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ నెల 11న రెండో దశ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో చిన్నచితక పార్టీలతో పాటు రెండు జాతీయ పార్టీలు ప్రచారం స్పీడ్‌ పెంచాయి. అస్సాంలోని బర్పేట ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ? కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ప్రధాని మోడీ బాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా.. అస్సాంలో అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఫైరయ్యారు. తరుణ్‌ గొగోయ్‌ 15ఏళ్ల పాలనలో తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు సోనియా గాంధీ.