అసోం, బెంగాల్‌లో వెల్లువిరిసిన ఓటరు చైతన్యం
– 80శాతం పైగా పోలింగ్
గౌహౌతి/కోల్‌కతా,ఏప్రిల్ 11(జనంసాక్షి):అస్సోంలో తుది దశ, పశ్చిమ బెంగాల్ లో రెండో దశ పోలింగ్ ముగిసింది. 82 శాతం పోలింగ్ నమోదయ్యింది. అస్సోంలో అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తౌెంది. మొత్తం 126 స్థానాలకు గానూ తొలి దశలో 65 స్థానాల్లో ఎన్నికలు జరుగగా, ఇవాళ (సోమవారం) 61 స్థానాల్లో పోలింగ్ పూర్తౌెంది. ఈ స్థానాల్లో భారీ పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి కలిసొస్తుందని పార్టీలు అంచనాలు వేసుకుంటున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్? దిస్పూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.పశ్చిమ బెంగాల్ లో రెండో దశ ఎన్నికల్లో హింస చోటు చేసుకుంది. జమూరియాలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సీపీఎం, టీఎంసీ పోలింగ్ ఏజెంట్ల మధ్య ఘర్షణ జరిగింది. కర్రలు, రాడ్లతో రెండు వర్గాలు కొట్టుకున్నాయి. ఈ ఘర్షణలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, అదే నియోజకవర్గంలోని మరో పోలింగ్ కేంద్రం దగ్గర బాంబులతో నిండిన రెండు బ్యాగులను గుర్తించారు. ఒక వ్యక్తి గన్ పట్టుకొని.. పోలింగ్ కేంద్రాల దగ్గర హడావిడి చేశాడు. పశ్చిమ బెంగాల్ లో కూడా 80 శాతం పోలింగ్ నమోదైంది.కొన్ని ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు. అస్సోంలో ఎన్నికలు ముగియడంతో?. ఏ పార్టీకి ఆధిక్యం వస్తుందని అంచనాలు మొదలయ్యాయి. అటు పశ్చిమ బెంగాల్ లో తరువాతి ఎన్నికల కోసం ప్రచారం కొనసాగుతోంది. అసోం ఎన్నికల్లో స్వల్ప ఉద్రిక్తత…ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహన్
రెండోదశ ఎన్నికలు జరుగుతున్న అస్సాంలో స్వల్ప హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. కామరూప్ జిల్లాలోని ఓ పోలింగ్ స్టేషన్‌లో స్వల్ప గందరగోళం కారణంగా సీఆర్పీఎఫ్ జవాను గాల్లోకి కాల్పులు జరిపాడు. అక్కడక్కడా అక్కడి సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ ప్రశాంత్ సైకియా కథనం ప్రకారం… ఓ మహిళ ఓటు వేసి పోలింగ్ స్టేషన్ బయటకు వచ్చింది. అయితే ఆమె బిడ్డ లోపల ఉండిపోవవడంతో తీసుకురావడానికి తిరిగి ఆమె పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించింది. అందుకు అక్కడున్న సీఆర్‌పీఎఫ్ జవాను అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో అక్కడ కొంత గందరగోళం నెలకొంది. కొంత మంది ఓటర్ల గుంపు అక్కడకు చేరి జవానుకు వ్యతిరేకంగా గొడవ చేశారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు సీఆర్‌పీఎఫ్ జవాను గాల్లోకి కాల్పులు జరిపాడు. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి అదుపులోనే ఉందని ఓటింగ్ సజావుగా కొనసాగుతోందని ఎస్పీ తెలిపారు. మిగతా ప్రాంతాల్లో అస్సాం ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ దిస్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మన్మోహన్ విూడియాతో మాట్లాడుతూ.. అస్సాంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పాలనను మెచ్చిన అస్సాం ప్రజలు మరోసారి తమకే పట్టం కడుతారని తెలిపారు. 61 శాసనసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇదిలావుంటే ఎన్నికల సంఘం(ఈసీ) బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అసోం ముఖ్యమంత్రి తరుణ్ గొగొయ్ ఆరోపించారు. ఈసీ ఇంతపక్షపాత ధోరణితో పనిచేయడం ఎన్నడూ చూడలేదని వాపోయారు. పోలింగ్ జరుగుతుండగా ప్రెస్ విూట్ పెట్టొద్దని ఈసీ మౌఖిక ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆయన మండిపడ్డారు. ‘ప్రెస్ విూట్ పెట్టొదని నాకు ఈసీ ఎందుకు అధికారికంగా లేఖ ఇవ్వలేదు? నేను లాయర్ని. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే నన్ను అరెస్ట్ చేయండి. నేనేవిూ బాధపడను. ఈసీ 100 శాతం పక్షపాతంతో వ్యవహరిస్తోంది. 55 ఏళ్ల నా రాజకీయ జీవితంలో ఇంత పక్షపాతంగా వ్యవహరించిన ఎన్నికల సంఘాన్ని ఎప్పుడూ చూడలేద’ని గొగొయ్ అన్నారు. రాష్ట్రంలోని మిగతా కాంగ్రెస్ నాయకులు కూడా ఈసీ పనితీరుపై ఆరోపణలు గుప్పించారు. మరోవైపు వెస్ట్ మిడ్నాపూర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న పశ్చిమబెంగాల్ కాంగ్రెస్ నాయకుడు మనాస్ భునియా కూడా ఈసీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బోగస్ మేనేజ్ మెంట్ అధ్వర్యంలో ఎన్నికల సంఘం నడుస్తోందని మండిపడ్డారు. మమతా బెనర్జీ సర్కారు ఒడిలో పసిపాపలా నిద్రపోతోందని ఈసీపై విరుచుకుపడ్డారు.