ఆంధ్రాకు అన్ని విధాలుగా సహకరిస్తాం

5

– సీఎం కేసీఆర్‌

– ఇచ్చిపుచ్చుకునే ధోరణి కొనసాగుతుంది

– భద్రాద్రి అభివృద్ధికి రూ. 100 కోట్లు

భద్రాచలం,ఏప్రిల్‌ 15(జనంసాక్షి): యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి అభివృద్దికి సిఎం కెసిఆర్‌ సంసిద్దత వ్యక్తం చేశారు. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో భద్రాచలం ఆలయ అభివృద్ధి కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని  కేసీఆర్‌ ప్రకటించారు. సీతారాముల కల్యాణ మ¬త్సవంలో పాల్గొన్న అనంతరం సీఎం విూడియాతో మాట్లాడారు. భద్రాచలం ఆలయం అభివృద్ధిపై చినజీయర్‌స్వామితో చర్చిస్తామని తెలిపారు. పర్ణశాల, జఠాయువు మండపం అభివృద్ధికోసం పూర్థిసాయి చర్యలు తీసుకుంటామన్నారు. భద్రాచలం విస్తరణతో పాటు పట్టణ అభివృద్దికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. యాదాద్రి తరహాలో భద్రాద్రిని అభివృద్ధి చేస్తామని, చినజీయర్‌ స్వామితో కలిసి 2రోజులు భద్రాచలంలోనే ఉండి అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తామని సీఎం తెలిపారు. సాగునీటి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేకుండా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయన్నారు. ఖమ్మం జిల్లాకు 2 సాగునీటి ప్రాజెక్టులు మంజూరయ్యాయని వెల్లడించారు. రెండు నదలు మధ్య ఉన్న ఖమ్మం జిల్లాకు కరవు పరిస్థితులు రాకూడదని, ఖమ్మం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. సీతారామ ప్రాజెక్టు పూర్తయ్యాక చాలా అద్భుతాలు

జరుగుతాయన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరు అందించటమే లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం వివరించారు. వచ్చే మూడేళ్లలో ఖమ్మం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు.  కృష్ణా, గోదావరి నదుల మధ్య ఉన్న ఖమ్మం జిల్లాకు కరువు పరిస్థితులు రాకూడదన్నారు. రాబోయే కాలంలో ఖమ్మంను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలు  అనేక విషయాల్లో పరస్పరం సహకరించుకుని… ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలని కేసీఆర్‌ అన్నారు. అన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌కు సాధ్యమైనంత మేర సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనవసరంగా గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఇద్దరికీ నష్టమేనన్నారు. ఆలంపూర్‌ నుంచి భద్రాచలం వరకు ఏపీ, తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్నాయని కేసీఆర్‌ తెలిపారు. ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెం ప్రాజెక్టు కిందికి వెళ్లిన నీరు తెలంగాణ వాడుకోవడానికి వీళ్లేదని… ఆ నీటిని ఆంధ్రా ప్రాంతమే వాడుకుంటుందన్నారు. దుమ్ముగూడెం వద్ద ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తామని తాను శాసనసభ సాక్షిగా హావిూ ఇచ్చినట్లు కేసీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ వెయ్యి టీఎంసీలు వాడుకున్నా ఆంధ్రాకు మరో 1500 టీఎంసీలు ఉంటాయన్నారు. నీటి విషయంలో సమస్యలు రాకుండా పరస్పరం  సహకరించు కోవాలని చంద్రబాబు చేసిన ప్రతిపాదనను తాను అంగీకరించినట్లు కేసీఆర్‌ చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే నీటిని తెలుగు బిడ్డలు ఎక్కడ వాడుకున్నా మంచిదేనని కేసీఆర్‌ అన్నారు. . భద్రాచలం నియోజకవర్గంలోని ముంపు మండలాల సమస్యలపై ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడానని, ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్‌ చెప్పారు. విూడియా సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు,కడియం శ్రీహరి, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎంపిలు బాల్క సుమన్‌, సీతారం నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.