ఆంధ్రుల చెప్పులు, వైఎస్ బూట్లు నాకితే మంత్రి పదవులు
చిన్నారెడ్డిపై మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఫైర్
సోనియా దయవల్ల నాడు నాకు మంత్రి పదవి..చిన్నారెడ్డి
అందరి తరపున విచారం వ్యక్తంచేస్తున్నా..
ఈ వ్యవహారాన్ని ఇంతటితో ఆపండి
శాంతింపజేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,మార్చి24(జనంసాక్షి): మంత్రి జగదీశ్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చిన్నారెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై శాసనసభలో తీవ్ర దుమారం చెలరేగింది. మంత్రి వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది.మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు, సభ్యులకు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పడం నేర్చకో అంటూ మంత్రి జగదీశ్‌రెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత చిన్నారెడ్డి వ్యాఖ్యలు చేశారు. కోపం పనికిరాదు…ఓపిగ్గా మాట్లాడాలని చిన్నారెడ్డి సూచించారు. దీంతో మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం అదేస్థాయిలో ఘాటుగా సమాధానం ఇచ్చారు. ఆంధ్రా నేతల చెప్పులు నాకి విూలా ఎమ్మెల్యేని కాలేదని, ూట్లు నాకి మంత్రి పదవులు తెచ్చుకోలేదని, ప్రజల ఆశీర్వాదంతో గెలిచామని స్పష్టం చేశారు. దీంతో జగదీశ్వర్‌రెడ్డి వ్యాఖ్యలపై సభలో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళన చేపట్టారు. దీంతో సభాపతి మధుసూదనాచారి రెండుసార్లు సభను వాయిదా వేశారు. ఈ రోజు శాసనసభలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, చిన్నారెడ్డిపై మంత్రి వ్యాఖ్యలు సరికాదని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ అన్నారు. అయితే తాను చేసిన వ్యాఖ్యలు పొరపాటని, వాటిని రికార్డుల నుంచి తొలగించాలని, తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని మంత్రి అన్నారు. అయినా సభ్యులు శాంతించలేదు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టుల అంశంపై ప్రశ్నోత్తరాల సందర్భంగా శాసనసభలో ఈ రగడ నెలకొంది. అయితే మరోవైపు తాను ఎవరి చెప్పులు నాకితే పదవులు వచ్చాయో లేక కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా దయతో వచ్చాయో సిఎం కెసిఆర్‌కు తెలుసని చిన్నారెడ్డి అన్నారు. తాను ఎవరి ద్వారానో పదవులు పొందలేదన్న విషయం సిఎం కెసిఆర్‌కు తెలుసని అంటూ, దానికి సంబంధించిన నేపథ్యాన్ని శాసనసభలో వివరించారు. తెలంగాణ శాసనసభలో మంత్రి జగదీశ్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలపై చర్చ చాలాసేపు కొనసాగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి మాట్లాడుతూ సభలో వివాదం చెలరేగినప్పుడు సీఎం కేసీఆర్ సభలో లేరని, తాను కొన్ని ప్రశ్నలు వేశానని… మంత్రి జవాబు ఇచ్చారన్నారు. వాయిదా తర్వాత సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలో థర్మల్ పవర్ ప్రాజెక్టు గురించి అడిగానని, తొలిసారి మంత్రి అయ్యారు… బాగా పనిచెయ్యండని మాత్రమే తాను జగదీశ్‌రెడ్డికి చెప్పానని, తన మాటల్లో ఎలాంటి తప్పులేదని… అయినా జగదీశ్‌రెడ్డి దూషణలకు దిగారన్నారు. 41మంది కాంగ్రెస్ సభ్యులు సోనియాకు హైదరాబాద్‌లో వినతిపత్రం ఇచ్చామన్నారు. తెలంగాణను మరిచిపోయారని సోనియాకు ఆనాడు గుర్తుచేశామన్నారు. తెదేపా హయాంలో మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులు పూర్తికావడంలేదని బాధ ఉండేదని… 2004లో వైఎస్‌కు ఇష్టం లేకున్నా తెరాసతో కలిసి పొత్తుకు ఒప్పించామన్నారు. అలా కెసిఆర్ తో కలిసింది మొదలు తనకు ఎలా పదవి వచ్చిందీ వివరించారు. కొత్తగా మంత్రి అయినా జగదీశ్ రెడ్డి ఓపికతో పనిచేయాలని సూచించారు. చిన్నారెడ్డి వివరణతో సిఎం కెసిఆర్ కూడా ఏకీభవించారు. వ్యవహారాన్ని ఇంతటితో వదిలేసి సభ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడంతో గొడవ సద్దుమణిగింది.
ఇక ఈ వ్యవహారంపై సభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాలపై మంత్రి హరీష్‌రావు తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా ముందుకెళ్తుందని స్పష్టం చేశారు. అవినీతి చరిత్ర కాంగ్రెస్‌ది అని చెప్పారు. సీబీఐ కోర్టుల చుట్టూ తాము తిరగడం లేదు. ఎవరు తిరుగుతున్నారో అందరికీ తెలుసు అని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చరిత్ర ప్రజందరికీ తెలుసు అని పేర్కొన్నారు. అవినీతిలో కూరుకుపోయిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. ముఖ్యమైన పద్దులపై చర్చ జరగాల్సి ఉన్నందున సభ్యులందరూ సహకరించాలని హరీష్‌రావు విజ్ఞప్తి చేశారు. శాసనసభలో కాంగ్రెస్ సభ్యులు కావాలనే గందరగోళం సృష్టిస్తున్నారని, కావాలంటే మైక్ వద్దకు వచ్చి మాట్లాడాలని సూచించారు. మైక్ ఇస్తామంటే పోడియంలోకి ఎందుకు వస్తున్నారని సభ్యులను మంత్రి ప్రశ్నించారు. భట్టి విక్రమార్కను ఉద్దేశించి.. పెద్దలు.. గౌరవనీయులు.. భట్టి విక్రమార్కగారు.. విూరు గతంలో డిప్యూటీ స్పీకర్‌గా పని చేశారు. విూకు సభా సంప్రదాయాలు తెలుసు. అయినప్పటికీ పోడియంలోకి ఎందుకు వెళ్తున్నారో అర్థం కావడం లేదన్నారు. సభా సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. మైక్ ఇస్తామని చెప్పినప్పటికీ పోడియంలోకి వెళ్లడం సరికాదు. మైక్ ఇచ్చినా మాట్లాడరు. పోడియంలోకి వెళ్తారు. ఇదేం సంప్రదాయం అని ప్రశ్నించారు. సభ పట్ల అమర్యాదగా ప్రవర్తించొద్దు అని సభ్యులకు మంత్రి సూచించారు.