ఆంధ్ర అభివృద్ధికి కట్టుబడ్డా

4

– అమిత్‌ షా

రాజమహేంద్రవరం,మార్చి6(జనంసాక్షి):పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హావిూయిచ్చారు. పోలవరంకు జాతీయ ¬దా ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం సాయంత్రం బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీపై కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తోందని, పోలవరంకు కాంగ్రెస్‌ చేసిందేవిూ లేదని అన్నారు. గ్రామాల్లో 24 గంటల విద్యుత్‌ సరఫరా తమ ఘనతేనని, 2019 నాటికి ప్రతి గ్రామానికి త్రీ ఫేజ్‌ కరెంట్‌ ఇస్తామని వాగ్దానం చేశారు. ఏపీలో రహదారుల అభివృద్ధికి రూ. 60 వేల కోట్లు ఇచ్చామని, పేదలకు లక్షా 90వేల ఇళ్లు మంజూరు చేశామని చెప్పారు. కాకినాడ, విశాఖలను స్మార్ట్‌ సిటీలుగా చేస్తున్నామన్నారు. అమరావతికి కేంద్రం రూ. 1500 కోట్లు మంజూరు చేసిందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ కు అన్ని రకాలుగా కేంద్రం సాయం అందిస్తోందని అమిత్‌ షా తెలిపారు.

ఆయన ఇంకా ఏమన్నారంటే….

రూ. 22 వేల కోట్లతో ఏపీలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ కు కేంద్ర సాయం రూ.3200 కోట్లతో మిస్సైల్‌ నిర్మాణ ప్రాజెక్టుకు అంగీకారం మంగళగిరిలో రూ.1618 కోట్లతో ఎయిమ్స్‌ నిర్మాణానికి కేంద్ర సాయం రూ. 25వేల కోట్లతో విశాఖలో హెచ్‌ పీసీఎల్‌ రిఫైనరీ యూనిట్‌.విజయనగరం జిల్లాకు గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విశాఖలో పెట్రోల్‌ యూనివర్సిటీ

కేంద్రం చేసే సాయాన్ని వివరించేందుకే ఏపీకి వచ్చా: అమిత్‌షా

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తగురీతిలో సాయం చేయలేదని దుష్ప్రచారం జరుగుతోందని, ఏపీకి కేంద్రం ఏవిధంగా సాయం చేస్తోందో తెలిపేందుకే ఇక్కడకు వచ్చానని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అన్నారు. ఆదివారం రాజమహేంద్రవరంలో భాజపా భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సభలో అమిత్‌ షా హిందీలో ప్రసంగించగా, భాజపా నేత దగ్గుబాటి పురంధేశ్వరి తెలుగులో అనువదించి కార్యకర్తలకు వినిపించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. పవిత్ర గోదావరి తీరాన సంకల్ప ర్యాలీలో పాల్గొనటం ఆనందంగా ఉందన్నారు. దేశంలో 30ఏళ్ల తర్వాత భాజపాకు ప్రజలు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో భాజపాను బలీయమైన శక్తిగా మార్చాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్డీయే ప్రభుత్వం అంకిత భావంతో ఉందని, అందుకు అన్ని చర్యలు తీసుకుంటోందని అమిత్‌ షా స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ హయాంలో పోలవరం నిర్మాణంపై ఎందుకు దృష్టిసారించలేదనిఅమిత్‌ షా ప్రశ్నించారు. భాజపా సహకారంతోనే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపగలిగామని వివరించారు. ఏపీకి జీవధార వంటి పోలవరం పూర్తి కావాలంటే ప్రధాని మోదీ నాయకత్వంలోనే సాధ్యమని.. పోలవరం పూర్తి చేసిన ఘనత ఏన్డీఏ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.