ఆకట్టుకున్న లక్ష్మీశ్రీజ
ఖమ్మం,ఏప్రిల్27(జనంసాక్షి):
టీఆర్‌ఎస్ ప్లీనరీ వేదికగా బాల మేధావి లక్ష్మీశ్రీజ ప్రసంగించారు. లక్ష్మీశ్రీజ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు.. స్టేజీ విూద ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, మంత్రులు, ఎమ్మెల్యే లందరికీ నమస్కారాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్థానంతో పాటు ఆయన పని చేసిన వివరాలను చక్కగా వివరిం చారు. సీఎం కేసీఆర్ కేబినెట్‌ను సంపూర్ణంగా తెలిపారు. మంత్రులు వారి శాఖలను చిన్నారి తెలియపరిచారు. ఇక లక్ష్మీశ్రీజ మాట్లాడుతున్నంత సేపు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ముసిముసి నవ్వులు నవ్వారు. చిన్నారి జ్ఞాపకశక్తి అందరూ మంత్రముగ్ధులయ్యారు. ఆశ్చర్యకితులయ్యారు. లక్ష్మీశ్రీజ మాట్లాడే కంటే ముందు సీఎం కేసీఆర్ వేదికకు లక్ష్మీశ్రీజను పరిచయం చేశారు. లక్ష్మీశ్రీజ తెలంగాణ ఉద్యమ చరిత్రను అలవొకగా చెబుతుందని తెలిపారు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన శ్రీజను దీవించడం జరిగిందన్నారు. నిన్న కూడా తన ఇంటికెళ్లి దీవించానని, శ్రీజకు ఐఏఎస్ కావాలనే కోరిక బలంగా ఉందన్నారు.