ఆచార్య జయశంకర్‌కు సీఎం కేసీఆర్ ఘన నివాళి
హైదరాబాద్:
తెలంగాణ ప్రాంతానికి సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయాన్ని విడమరిచి వివరించిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్‌సార్ అని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం వల్ల కలిగే లాభాలను కూడా వివరించారని తెలిపారు. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్‌సార్ నాలుగో వర్దంతి సందర్భంగా తెలంగాణభవన్‌లోని జయశంకర్‌సారు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం సభలో ఆయన ప్రసంగించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నామన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత జరుగుతోన్న అభివృద్ధి తప్పక సారు ఆత్మకు శాంతిని చేకూర్చుతుందని పేర్కొన్నారు. జయశంకర్‌సార్ నుంచి స్ఫూర్తి పొందేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమానికి ఆయనే దిశనిర్దేశం అన్నారు. తెలంగాణే శ్వాస, ధ్యాస,లక్ష్యం గా కొనసాగేరని కేసీఆర్ అన్నారు.బంగారు తెలంగాణ సాధించడమే సార్‌కు నిజమైన నివాళి అని, ఆ దిశగా తెలంగాణ సమాజం పునరంకితం కావాలన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఆయనే సిద్ధాంతకర్తని ఆయన చూపిన ఆహింసా మార్గములేనే తెలంగాణ సాధ్యం అయిందన్నారు. 1969 ఉద్యమంలో సిటీ కాలేజ్‌లో జరిగిన పోలీసు కాల్పుల్లో ఆయన మరణించి ఉండిఉంటే ఇప్పటి తెలంగాణ సాధ్యం అయ్యేది కదన్నారు. నాడు బస్సు చెడి పోవడంతో వరంగల్-హైదరాబాద్ మార్గ మధ్యంలో సార్ నిలిచి పోయారన్నారు. సిటీ కాలేజ్ లో సార్ పాల్గొనాల్సిన కార్యక్రమంపై కాల్పులు జరిగి పలువురు విద్యార్ధులు మృతి చెందారు.