ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మొదటి మహాసభలను జయప్రదం చేయండి. –ఐ ఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రసాద్.
టేకులపల్లి, నెంబర్ 23( జనం సాక్షి ): సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే ఆటో మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మొదటి మహాసభలను జయప్రదం చేయాలని ఐ ఎఫ్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి డి ప్రసాద్ ,మోటార్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు పాయం వెంకన్న కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం టేకులపల్లి లో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2019 మోటార్ వాహనాల చట్టం రోడ్డు సేఫ్టీ బిల్లులను తీసుకువచ్చి ఆటో, కారు, లారీ ,ట్రాక్టర్ ,వ్యాను తదితర మోటార్ కార్మికులపై అదనపు భారాన్ని మోపాయని విమర్శించారు. మోటార్ రంగ కార్మికులకు శాపంగా మారిన 2019 మోటార్ వాహనాల చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మోటారు కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఈనెల 25వ తేదీన హైదరాబాదులో నిర్వహించనున్న ఆటో మోటార్ వర్కర్స్ రాష్ట్ర మొదటి మహాసభలలో మోటర్ వాహన కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో రవి ,మహేష్ ,జానీ,లాలు, శ్రీను, రత్నాచారి, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.