“ఆడపడుచులకు బంగారు కానుక బతుకమ్మ చీరలు” తాండూర్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
యాలాల సెప్టెంబర్ 23 (జనంసాక్షి) : దసరా పండుగకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని మండల కేంద్రంలో ఈరోజు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి గారు పాల్గొని చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికులు తయారుచేసిన చీరలను బంగారు తెలంగాణలో ఆడపడుచులకు అందించడంతో ఆడపడుచుల ముఖాల్లో పండుగ వేళ ఆనందం నింపుతున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారికి దక్కుతుందని ఆయన అన్నారు. ప్రజలకు కావలసిన వివిధ సంక్షేమ పథకాలైన మిషన్ భగీరథ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు బీమా, రైతుబందు వంటి వాటి తో పాటు పల్లె ప్రగతి వంటి కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో అమలు జరుగుతున్న తీరు హర్షించదగిన విషయము అని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్ గారితో కలిసి మండలంలోని వివిధ గ్రామాలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం తో పాటు కొత్త పెన్షన్ లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేసినారు. మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో సిద్ధిరాల సులోచన, వైస్ ఎంపీపీ రమేష్, తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ , వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డి, మండల టిఆర్ఎస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి మరియు మండల కో ఆప్షన్ సభ్యులు అక్బర్ బాబా, ఎంపీడీవో పుష్పలీల, డిప్యూటీ ఎమ్మార్వో లక్ష్మణ్ నాయక్, ఆశన్న పంచాయతీ కార్యదర్శి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు పార్టీ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.