ఆత్మీయ జర్నలిస్టు మిత్రున్ని కోల్పోయాం..
డి పి ఆర్ ఓ మామిండ్ల దశరథం.
జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావు మృతి పట్ల సంతాపం.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 21. (జనం సాక్షి) సీనియర్ జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావు మృతితో ఆత్మీయున్ని కోల్పోయామని డిపిఆర్ఓ మమిండ్లా దశరథం అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సీనియర్ జర్నలిస్ట్ కారంగుల వినోద్ రావ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వినోద్ రావు చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డిపిఆర్ఓ మామిండ్ల దశరథం, సిరిసిల్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాలమాకుల శేఖర్ మాట్లాడుతూ సుదీర్ఘకాలం నవ తెలంగాణ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తూ అనేక ప్రజా సమస్యలపై మానవీయ కథనాలను అందించారని అన్నారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించే వినోద్ రావు మృతి పట్ల సంతాపం తెలిపారు, ఆత్మీయ మిత్రున్ని కోల్పోయామని కన్నీటి పర్యంతరం అయ్యారు. వినోద్ రావ్ మృతి పట్ల స్థానిక శాసనసభ్యులు మంత్రి కేటీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు కుటుంబాన్ని ఆదుకుంటామని విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వినోద్ రావు అంత్యక్రియలను ఆయన స్వగ్రామం కొనరావుపేట మండలం బావుసాయిపేటలో నిర్వహిస్తున్నట్లు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పాలపాకుల శేఖర్ తెలిపారు. సంతాప సమావేశంలో సీనియర్ జర్నలిస్టు టీవీ నారాయణ, ఆకుల జయంత్, చల్ల ప్రసాద్ రెడ్డి, మిట్టపల్లి కాశీనాథ్, కాంబోజు ముత్యం,ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి చిలుక సత్యనారాయణ,పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు