ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో , నమ్మకంతో ప్రయత్నించండి విజయం మీ సొంతం.
రఝునాధపాలెం అక్టోబర్ 21 జనం సాక్షి
ఖమ్మం : నగరంలో సర్దార్ పటేల్ స్టేడియం నందు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఎచీవర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్సై , కానిస్టేబుల్ గ్రూపులకు ప్రిపేర్ అయ్యే విద్యార్థిని , విద్యార్థులకు ఎటువంటి భయబ్రాంతులకు గురి కాకుండా వందల , వేయుల పోస్టులలో నాది ఒకటి అని ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకుండా మనోధైర్యంతో , నమ్మకంతో ప్రయత్నిస్తే విజయం మీ సొంతం అని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ డిస్టిక్ టాస్క్ పోర్స్ సిఐ కె. పోశెట్టి అన్నారు . ఈ సందర్భంగా గ్లోబర్ ఇనిస్ట్యూట్ డైరెక్టర్ వరికూటిమోహన్ ,గత ఎనిమిది సంవత్సరాలుగా ఎంతోమంది తల్లిదండ్రులేని మరి అతి పేదలకు ఫ్రీగా ఎడ్యుకేషన్ తో పాటు గ్రౌండ్ ఈవెంట్స్ నేర్పిస్తూమా గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా సెటిల్ అయ్యారుుఈ మధ్యకాలంలో పీ సెట్ స్టేట్ వైస్ లు జరిగిన పీఈసెట్లో స్టేట్ ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది కోచ్ త్రినాథ్ మాట్లాడుతూ గత రెండు నెలలుగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నామని , పేద పిల్లలకు ఉచితంగా కోచింగ్ ఇస్తున్నామని పేర్కొన్నారు . ఈ గ్రౌండ్ ఈవెంట్స్ కి గ్రౌండ్ను అన్ని విధాలయాలుగా ఉపయోగించుకునేందుకు సహకరిస్తున్న డివైఎస్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు .