ఆధ్యాత్మికం
కార్యదీక్ష మన కర్తవ్యం కావాలి
ఎదుటివారు స్వశక్తి, కృషి, అంకితభావంతో అభివృద్ధి సాధిస్తుంటే చూడలేరు. అసూయతో రగిలి పోతుంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి గురించి ద్వేషంతో విషం కక్కుతుంటారు. పాముకు కోరల్లోనే ఉండే విషం వీరికి అణువణువునా నిండి విషవృక్షంలా కనిపిస్తారు. ‘ఖలునకు నిలువెల్ల విషము కదరా సుమతీ’ అన్నాడు శతక కవి. మనిషి నడవటానికే కాదు, జీవన యానానికీ మంచి బాట ఉండాలి. అది కనిపించేది కాదు. మనసుతో అనుభూతి చెందేది. జీవన గతి సవ్య ప్రస్థానానికి అది దోహదపడుతుంది. ఏ బాట అయినా గమ్యం దగ్గర ముగిసిపోతుంది. అందరి గమ్యాలూ ఒక్కటిగా ఉండవు. జ్ఞానం కలిగాక, ఎవరి గమ్యం వారు ఎంపిక చేసుకోవాల్సిందే. అందులోనే మనిషి విజ్ఞత వెల్లడవుతుంది. అధిక శాతం మానవుల్లోఅసూయ, ద్వేషం అనే రెండు ముళ్లు అశాంతిని కలిగిస్తుంటాయి. ఈ కారణం వల్లనే ఆధునిక ప్రపంచం ప్రేమలేని ఎడారిలా మారింది. విషానికి విరుగుడుగా సంజీవని ఉన్నట్లే, అసూయా ద్వేషాలకు విరుగుడుగా ‘అవ్యాజ ప్రేమ’ను చెప్పుకోవాలి. మనసుకు ప్రేమను నేర్పాలి. అది పెరిగే కొద్దీ అసూయ, ద్వేషం మంచులా కరిగిపోతాయి. అప్పుడు జీవనయానం పూలబాటలోనే సాగుతుంది! ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలండి’ అని యువతకు ప్రబోధం చేసిన మహనీయుడు స్వామి వివేకానంద. ‘గమ్యం చేరేవరకు ఆగవద్దు’- అనే వేదవాక్యాన్ని గుర్తుచేస్తూ వైతాళిక గానం సాగించారాయన. భారతజాతిలో నూతనోత్సాహం నిండేలా చేస్తూ ఇలా అన్నారు- ‘ఎన్నడూ నిరుత్సాహపడవద్దు. విూ విశ్వాసాలకు విూరు బద్ధులు కండి. ప్రపంచమంతా విూకు పాదాక్రాంతమవుతుందన్నారు. వివేకానంద మాటలు అక్షరసత్యాలు, అందరికీ ఆచరణీయాలు. అవి ఆత్మవిశ్వాస ప్రేరకాలుగా మనమంతా సాగాలి. అందుకే హనుమంతుడి కార్యదీక్షను అవగతం చేసుకున్నవారెవరూ నిరుత్సాహానికి గురి కారు. కార్యసాధకులు ఎన్నడూ విశ్రాంతి కోరరు. దీక్ష, లక్ష్యం ఉన్నతంగా, ఉత్తమంగా ఉండాలి. అప్పుడు ఇతర ఆలోచనలు రమ్మన్నా రావు. ఆంజనేయుడు లంకా నగరం చేరడానికి ఎన్నో అవరోధాలు దాటాడు. అక్కడ రాక్షస దర్పాన్ని అణచివేశాడు. సీతమ్మ జాడ కనిపెట్టాడు. ఆమెకు శ్రీరాముడి ఉంగరాన్ని ఇచ్చాడు. అశోకవనాన్ని ధ్వంసం చేశాడు. రావణుడికి బుద్ధి చెప్పాడు. తన తోకకు రక్కసులు నిప్పుపెడితే, దానితోనే ఆయన లంకాదహనం గావించాడు. సీతాదేవి ఇచ్చిన శిరోమణిని శ్రీరాముడికి అందించాడు. ఆమె క్షేమ సమాచారాన్ని ఆయనకు తెలియజేశాడు. అందుకే హనుమ కార్యసాధన సామర్థ్యాన్ని రాముడు మెచ్చుకొన్నాడు. ‘ఈ సమయంలో నేను ఇవ్వగలిగింది ఇదే’ అంటూ మనసారా కౌగిలించుకున్నాడు! పట్టుదలతో పనిచేసేవారందర్నీ హనుమంతుడు కౌగిలించుకొని ముందుకు నడిపిస్తాడు.
—–