ఆర్థిక విధానాల లోపాల కారణంగానే నల్లధనం వృద్ది
భారత్‌లో నగదు నిల్వలను దాచుకునేలా ప్రభుత్వ విధానాలు లేకపోవడంతో ఆ డబ్బంతా నల్లధనంగా విదేవాలకు తరలుతోంది. ప్రభుత్వ విధానాలను సవిూక్షించుకునే అవకాశాలపై ఏనాడూ చర్చ సాగడం లేఉద. నల్లధనంరప్పించే ప్రయత్నాలు ఎలా ఉన్నా దేశంలో ఉన్న డబ్బుకు తెల్ల రూపం ఇచ్చే నిర్ణయాలపై చర్చ చేయడం లేదు. ఇన్‌కమ్టాక్స్ విధానాలు, ప్రస్తుత చట్టాల కారణంగా డబ్బు నల్లధనంగా మారుతోంది. హవాలా మార్గాల్లో విదేవాలకు తరలుతోంది. దీంతో దేశ ఆర్థికవ్యవస్థ దినదినం దిగజారుతోంది. విదేవాలకు తరలే డబ్బు ఇక్కడే పెట్టుబడుల పెట్టేలా అవకాశాలను పెంచాల్సి ఉంది టాక్సేసన్ విదానం మారి, బ్యాంకులు ఓపెన్‌గా ముందుకు రాగలగాలి. నగదురహిత లావాదేవీలపై ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం నల్లడబ్బు ముందుగా తెల్లగా మారి బ్యాంకుల్లో చేరేలా సాధారణ రుసుం లేదా ఇతర మార్గాలను ఆలోచించాలి. ధనవంతులు తమ నగదు నిల్వలను రియల్ ఎస్టేట్, బంగారం,ఇతర ఆస్తులపై పెట్టుబడులుగా పెట్టడం ఎక్కువ కావడంతో బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోయాయి. దాంతో..ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేట్‌లో మార్పు ఉండకపోవచ్చని తెలిపింది. రియల్ ఎస్టేట్‌లోకి తరలిస్తున్న పెట్టుబడుల్లో 30 శాతంకుపైగా నల్లధనమేనని నిపుణులు చెబుతున్నారు. అంతేగాకుండా ఇతరత్రా అది విదేశాల్లో పెట్టుబడులకు కారణమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని, వృద్ధి మరింత పెరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎప్పటికప్పుడు ప్రకటిస్తున్న తీసుఉకుంటున్న చర్యలు నల్లధనం పోగుపడేలా చేస్తుందే తప్ప తగ్గడం లేదు. ప్రబుత్వ విధానాలు డబ్బు తరలడానికి ఉపయోగపడుతోందే తప్ప దేశంలోనే నిల్వలులగా ఉండేలా చేయడం లేదు. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం బ్యాంకుల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో జైట్లీ సమావేశం కానున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర విధానాలు చర్చించాలి. నల్లధనం అదుపునకు అంటే ఎవరు ఎంత సంపాదించుకున్నా, దానిని సక్రమమార్గాల్లో వినియోగించేలా వివిధ దేశాల్లో ఉన్న విధానాలను పరిశీలించాలి. అవసరమైతే అధ్యనం చేయాలి. ప్రతి ఒక్కరి నుంచి సూచనలు సలహాలు వచ్చేలా చర్చ చేయాలి. మొండిబకాయిలు, నిరర్థక ఆస్తులను పారదర్శకంగా వెల్లడించడంతో పాటు, వాటికి కేటాయింపులను కూడా అధికంగా చేయడంతో, ప్రభుత్వ రంగ బ్యాంకులకు నష్టాలు పెరిగాయి. ఈ నేపథ్యంలోనే పరపతి విధానంలో ఆర్‌బీఐ నిర్ణయాలు ఉండాలని కోరుకుంటున్నారు. బ్యాంకుల పద్దులను పారదర్శకంగా మార్చడం ద్వారా వాటిని బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని, తద్వారా ఆర్థిక ప్రగతికి అవి తోడ్పడతాయని అంటున్న జైట్లీ నల్లధనం అరికట్టి దానిని సద్వినియోగం చేసుకునేందుకు తీసుకున్న నిర్ణాయమలు సత్ఫలితం ఇచ్చినట్లుగా దాఖాలాలు చూపడం లేదు. మొండి బకాయిల వసూలుకు అవసరమైన అధికారాలను బ్యాంకులకు ఇచ్చారు. వృద్ధి కొనసాగేందుకు రుణాలు ఇవ్వడాన్ని బ్యాంకులు కొనసాగించాలని సూచించారు. అయితే ఇది పెద్దగా ప్రభావం చూపడం లేదు. బ్యాంకులకు రుణాలు ఎగవేస్తున్న వారి సంక్యపెరుగుతోంది. ఇదో రకంగా బ్లాక్ మనీగా మారుతోంది. దివాలా చట్టం, వ్యూహాత్మక రుణ పునర్‌వ్యవస్థీకరణతో బకాయిల వసూలుకు బ్యాంకులకు అధికారాలు ఇచ్చినా వసూళ్లు సాధ్యం కావడం లేదు. విజయ్‌మాల్యా లాంటి వారు ఎగవేత వేసి చెక్కేసినా ఏవిూ చేయలేకపోతున్నాం. ఎన్‌పీఏలన్నీ మోసాల వల్ల ఏర్పడినవి కావని, వ్యాపారాల్లో ఏర్పడిన నష్టాల వల్ల ఎదురైనవే అత్యధికమని భావిస్తున్నారు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకులు నిర్వహణ లాభాన్ని ఆర్జించాయని, అధిక బ్యాంకులు మొండి బకాయిలకు కేటాయింపులు తగిన మేర జరపడం వల్లే నష్టాలు
ప్రకటించాయని వివరించారు. ఎన్‌పీఏలు ఎప్పుడూ ఉంటున్నాయని, వాటిని బ్యాంకులు పారదర్శకంగా వెల్లడించడమే మేలని, అదే ఇప్పుడు జరుగుతోందని తెలిపారు. ఇకపోతే భారత కుబేరులు విదేశాల్లో దాచుకున్న నల్లడబ్బు రూ.30 లక్షల కోట్లుగా నూతన అధ్యయనం ద్వారా అంచానా వేశామని యాంబిట్ క్యాపిటల్ రీసెర్చ్ వెల్లడించింది. ఇది దేశ జిడిపిలో 20 శాతంగా వున్నట్లు ఆ సంస్థ పేర్కొన్నది. 2016 ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపిని 2.3 లక్షల కోట్ల డాలర్లు అంటే రూ.154 లక్షల కోట్లుగానూ, నల్లడబ్బును 460 బిలియన్ డాలర్లు అంటే రూ.30 లక్షల కోట్లుగానూ క్యాపిటల్ రీసెర్చ్ అంచనా వేసింది. కొన్నేండ్లుగా విదేశీ ఖాతాల్లోకి వెళ్తున్న నల్లడబ్బు తగ్గుతున్నా.. ఇప్పటికీ అది తక్కువేవిూ కాదని.. థాయిల్యాండ్, అర్జెరటీనాల జీడీపీకన్నా ఎక్కువేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. అయితే విత్త నిర్వహణ పారదర్వకంగా లేకపోవడం వల్ల దేశంలో దానిని వివిధ రంగాల్లో పెట్టుబడులకు అవకాశం లేకుండా పోతోంది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వినియోగిస్తున్న డబ్బు సంగతి ఏమిటి? ఓటర్లను ఆకర్షించేందుకు డబ్బు పంచడం అనేది బహిరంగ రహస్యమే అయినా దీనిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదనే భావన సమాజంలో నెలకొని ఉంది. ఇదంతా బ్లాక్మనీగానే గుర్తించాలి. దీంతో ఓటర్లను లోబర్చుకునేందుకు వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కోటానుకోట్ల రూపాయలు ఎన్నికల్లో వివిధ రకాలుగా ఖర్చు చేస్తూ కంటితుడుపుగా లెక్కలు చూపించే వ్యవహారం సాగుతోంది. అధికారంలోకి వచ్చిన వారు దీనిపై పెద్దగా పట్టించుకోవడంలేదు. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకోకపోవడం వల్లనే నల్లధనం బలపడుతోందన్నది బహిరంగం రహస్యం.