ఆలం కేసు తిరగదోడండి…హోం మంత్రి రాజ్‌నాథ్
న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): ఆలంఫై ఉన్న కేసులను తిరిగి పరిశీలించాలని జమ్నుకశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సూచించారు. జమ్మూ కశ్మీర్ వేర్పాటు వాది మస్రత్ ఆలం విడుదలపై పార్లమెంట్‌లో రగడ కొనసాగుతున్నది. ఈమేరకు కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ లోక్‌సభలో ప్రకటన చేశారు. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నుంచి తమకు రెండో నివేదిక అందిందని వెల్లడించారు. ఆలంపై కేసులను తిరిగి అధ్యయనం చేయాలని ముఫ్తీ మహ్మద్ సర్కారును ఆదేశించామన్నారు. వేర్పాటువాది బెయిల్‌ను కోర్టులో సవాలు చేయాలని సూచించారు. న్యాయపరమైన చర్యలు చేపట్టమని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఆలం అతని సహచరుల కదలికపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు అనుమానం వస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. కాగా, మసరత్ ఆలంను నిర్బంధించి ఉంచేందుకు తమ ప్రభుత్వం వద్ద సహేతుకమైన కారణాలేవీ లేవని, అందుకే అతడిని విడుదల చేశామని కేంద్ర ప్రభుత్వానికి సీఎం ముఫ్తీ మహ్మద్ సయ్యద్ లేఖ రాసిన విషయం తెలిసిందే.