ఆలం విడుదలపై లోక్‌సభలో గందరగోలం

5
భద్రతపై రాజీ లేదు

నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తాం

ప్రధాని నరేంద్ర మోడీ

న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): వేర్పాటు వాదుల, ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్ము-కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వేర్పాటు వాది మస్రమ్‌ ఆలం తో సహా పలువురిని విడుదల చేసిన ఘటనపై లోక్‌ సభలో తీవ్ర ఆందోళన వ్యక్తం అయింది. దేశ సమగ్రత, సార్వభౌమత్వంల విషయాలలో ఎలాంటి రాజీ లేదని అన్నారు. ప్రజలందరి ఆవేదనతో తాను ఏకీభవిస్తానని అన్నారు. కశ్మీర్‌ నుంచి నివేదిక వచ్చాక,ఆ వివరాలను కూడా సభ ముందు పెడతామని ఆయన అన్నారు. జమ్ముకశ్మీర్‌ వేర్పాటు వాద నాయకుడు ముసరాత్‌ ఆలయం విడుదలపై కేంద్రానికి ఎలాంటి సమాచారం లేదని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అయితే దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని అన్నారు. ఆలం విడుదల అంశంపై లోక్‌సభలో విపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రధాని స్పందించారు. సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములకు కూడా సమాచారం లేదన్నారు. ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం అని పేర్కొన్నారు. ఆలం విడుదలపై ప్రజల్లో వ్యక్తమైన భావాలు, సభ్యుల ఆందోళనతో తాను ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. వేర్పాటు వాదులు, ఉగ్రవాదుల విషయంలో ప్రభుత్వ రాజీ పడదని వెల్లడించారు. ప్రధాని సమాధానంతో సంతృప్తి చెందని కాంగ్రెస్‌ సభ్యులు లోక్‌సభలో ఆందోళనను కొనసాగంచారు. జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వంలో భాగస్వామి అయిన బిజెపి ప్రభుత్వం నుంచి బయటకు రావాలని కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున ఖర్గే అన్నారు. ఖర్గే సూచన కు ధన్యవాదాలని , ఆ సలహాను మనసులో ఉంచుకుంటామని వెంకయ్య నాయుడు వ్యంగ్యంగా అన్నారు. దేశ సమగ్రతపై స్పష్టత ఉంటే ప్రభుత్వం నుంచి తప్పుకోవాలని ఖర్గే స్పష్టం చేశారు. అంతకుముందు  కాశ్మీర్‌ వేర్పాటువాద నేత ఆలం విడుదలపై పార్లమెంట్‌ ఉభయ సభలు సోమవారం దద్దరిల్లాయి.  ఈ సందర్భంగా ప్రధాని సభలో వివరణ ఇచ్చారు.  ఆలం విడుదలపై సభ్యుల ఆందోళనలతో తాను ఏకీభవిస్తున్నట్లు మోదీ తెలిపారు. ఆలం విడుదలపై కేంద్రానికి సమాచారం లేదన్నారు. ఇటువంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ఆయన అన్నారు.  సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యులకు కూడా సమాచారం లేదన్నారు.  ఈ ఘటనపై వివరణలు వచ్చిన తర్వాత సభకు తెలియచేస్తామన్నారు.దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను సహించేది లేదని తేల్చి చెప్పారు. దేశ ప్రజలకు భద్రతపై భరోసా ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉందని పేర్కొన్నారు. ఉగ్రవాదల దుశ్చర్య కారణంగా మా నాయకుడు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీని బలి తీసుకుంది. అలం విడుదలపై జమ్మూ కాశ్మీర్‌ సర్కారు వివరణ ఇవ్వాల్సి ఉంది. రాష్ట్ర సర్కార్‌ నుంచి సమాధానం రాగానే వివరణ ఇస్తామని మోడీ ప్రకటించారు. పార్లమెంట్‌ లో మసరత్‌ ఆలం విడుదలపై విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో పాటు స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అంతకుముందు కేంద్ర ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో ఎట్టి పరి/-థసితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని  స్పష్టం చేశారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో….కశ్మీర్‌ వేర్పాటు వాద నాయకుడు మురాత్‌ ఆలం విడుదలపై రాజ్‌నాథ్‌ సింగ్‌ లోక్‌సభలో ప్రకటన చేశారు. ఆలం విడుదలపై జమ్ముకశ్మీర్‌ ప్రభుత్వం నుంచి నివేదిక వచ్చిందన్నారు. మసరాత్‌ ఆలంపై 27 కేసులు ఉన్నాయని, 27 కేసుల్లో ఆలంకు బెయిల్‌ లభించిందని సభకు వివరించారు.అలం విడుదలపై జమ్ము సర్కారు నివేదిక ఇచ్చింది. దేశ భద్రతలో రాజీపడే ప్రసక్తే లేదు. స్టేట్‌ సర్కార్‌ పూర్తి స్థాయి నివేదిక ఇచ్చిన తరువాత దీనిపై స్పందిస్తామని ¬ంమంత్రి ప్రకటించారు. కశ్మీర్‌  వేర్పాటువాద నేత , హురియత్‌ నాయకుడు మసారత్‌ ఆలం విడుదలపై  పార్లమెంటు ఉభయపభలు సోమవారం దద్దరిల్లాయి. ఈ రోజు ఉదయం లోక్‌ సభ ప్రారంభమైన వెంటనే  కాంగ్రెస్‌ మరికొన్ని ప్రతిపక్షాలు ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయాలని కోరాయి.  దీనిపై ప్రధాన మంత్రి వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో స్పీకర్‌  సుమిత్ర మహాజన్‌ సభను 15  నిమిషాల పాటు సభను వాయిదా వేశారు.  సభ తిరిగి  ప్రారంభమైన తరువాత వివాదం సద్దుమణగలేదు. దీనిపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య  నాయుడు స్పందిస్తూ  ఇది చాలా తీవ్రమైన విషయన్నారు. దేశానికి సంబంధించింది…పార్టీకి సంబంధించి కాదంటూ  వివరణ  ఇచ్చారు.  ఈ వ్యవహారంపై కశ్మీర్‌ వ్యవహారాలను చూస్తున్న ¬ం మంత్రి వివరణ  ఇస్తారని, అవసరమైతే ప్రధాని  కూడా కల్పించుకుంటారని ప్రకటించారు.    ¬ంమంత్రి  వివరణ  ఇస్తారని స్పీకర్‌  ప్రకటించినా సభ్యులు శాంతించలేదు.   ఆలం లాంటి టెర్రరిస్టును విడుదల చేయడం దేశానికి నష్టమని కాంగ్రెస్‌ సభ్యులు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు.   దీనికి  కశ్మీర్‌ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న  బీజేపీ కూడా బాధ్యత వహించాలన్నారు. జవాబ్‌ దో…. ప్రధానమంత్రి జవాబ్‌ దో అంటూ కాంగ్రెస్‌ , టీఎంసీ  సభ్యులు నినాదాలు చేశారు.   చివరికి ప్రధాన నరేంద్ర మోదీ  వివరణ ఇవ్వాల్సి  వచ్చింది.   ఆలం విడుదలపై కేంద్రానికి ..జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం సమాచారం ఇవ్వలేదని  తెలిపారు.  తాము దేశం కోసం  రాజకీయాలు   చేస్తున్నామని ఇలాంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని ప్రకటించారు. కశ్మీర్‌ ప్రభుత్వాన్ని నివేదిక కోరామని పూర్తిస్థాయి నివేదిక అందాక  తీవ్రమైన చర్యలు తీసుకుంటామన్న మోదీ  వివరణతో   వివాదం సద్దు మణిగింది.  మరోవైపు లో  రాజ్యసభలో కూడా  మసారత్‌ అలాం విడుదలపై రాజ్యసభలో   ఆగ్రహం పెల్లుబుకింది.  కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరాత్‌ ఆలం విడుదలపై రాజ్యసభలో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సభలో మాట్లాడుతూ దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం, పార్టీ రాజీపడదని అన్నారు. ఆలం విడుదలపై జమ్ము కశ్మీర్‌ ప్రభుత్వం నివేదిక ఇచ్చిందని తెలిపారు. ఆలం విడుదలపై ¬ంమంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు.