ఆశ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి :రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సునీత.

వనపర్తి టౌన్ఆ..శ వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని ఇందుకోసం ఈనెల 18వ తేదీన కలెక్టర్ కార్యాలయం ముందు తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలని ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సునీత సిఐటియు జిల్లా అధ్యక్షులు మండ్ల రాజు లు పిలుపునిచ్చారు ఆశా వర్కర్స్ డిమాండ్ డే సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు అనుమతి కోరుతూ జిల్లా వైద్య అధికారి రవిశంకర్ కు ఆశ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు డబ్ల్యు హెచ్ ఓ ఐ ఎల్ సిఫారసుల ప్రకారం ఆశా వర్కర్లను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం పెన్షన్ ఇవ్వాలని ఈఎస్ఐ చట్టబద్ధ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్ చేశారు స్కీంను ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వమే నిర్వహించాలని కార్మికులకు వ్యతిరేకంగా ఉన్న లేబర్ కోర్టులను వెనక్కి తీసుకొని 29 కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని అన్నారు ఆంధ్రప్రదేశ్లో లా ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం పదివేల రూపాయలు ఇవ్వాలని 2021 జూలై నుండి డిసెంబర్ వరకు ఆరు నెలల పిఆర్సి ఏరియర్స్ వెంటనే చెల్లించాలన్నారు కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 16 నెలల రిస్క్ బకాయిలు వెంటనే చెల్లించాలని 32 రకాల రిజిస్టర్లు ప్రింట్ చేసి ప్రభుత్వమే సప్లై చేయాలని కోరారు రిజిస్టర్ల కొనుగోలుకు ఆశ వర్కర్లు పెట్టిన ఖర్చు డబ్బులు వెంటనే చెల్లించాలని ఐదు సంవత్సరాల పెండింగ్ యూనిఫార్మ్స్ వెంటనే ఇవ్వాలని ఆశల కాళీ పోస్టులు భర్తీ చేయాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలన్నారు హెల్త్ కార్డులు ఇవ్వాలని అధికారుల వేధింపులు ఆపాలన్నారు ఈ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 18న వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయము ముందు ధర్నా కార్యక్రమం ఉందన్నారు ఇందుకోసం ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు చిట్టెమ్మ శ్యామల రమాదేవి భాగ్యమ్మ సునీత ఆశాలత మాధవి మహేశ్వరి కళావతి కవిత తదితరులు పాల్గొన్నారు.