ఆసుపాక తండా లో గర్భిణీలకు సీమంతాలు

అశ్వరావుపేట, సెప్టెంబర్ 14( జనంసాక్షి )

 

అశ్వారావుపేట మండలంలోని ఆసుపాక తండా అంగన్వాడి కేంద్రంలో గర్భిణీలకు సీమంతాలు చేశారు.తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలో 30 రోజులు పాటు పోషణ మాసా వారోత్సవాలుగా ఘనంగా నిర్వహిస్తున్నారు. అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామపంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రం లో టీచర్ సుజాత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేసి పసుపు కుంకుమ అందజేశారు. ఈ సందర్భంగా సిడిపిఓ రోజా రాణి సూపర్వైజర్ విజయలక్ష్మి, ఎసిడిపిఓ మహబూబ్ అలీ లు హాజరయ్యారు.
సిడిపిఓ రోజా రాణి మాట్లాడుతూ గర్భిణీలు బిడ్డ తల్లి క్షేమం కోసం తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లులు సమయంలో పోషకాహారాన్ని తీసుకోవాలని అన్నారు.

పుట్టిన తర్వాత బిడ్డకు తల్లి పాలును మించిన ఆహారం మరొకటి లేదని, తల్లి పాల వల్ల పిల్లలకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్క తల్లి మూర్రిపాలు పట్టించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం లో చిన్నారులను అలరించే విధంగా ఆకుకూరలు,కూరగాయలతో తయారుచేసిన వంటకాలు ఆకట్టుకున్నాయని వాటిని చూస్తే పిల్లలపై టీచర్స్ కి ఉన్న అంకిత భావం గొప్పదని ఆమె అన్నారు.అనంతరం ఇటీవల కొత్తగూడెంలో ఎన్నారై సౌజన్యంతో అందజేసిన డిజిటల్ హెచ్డి టీవీని సిడిపిఓ రోజా రాణి ప్రారంభించి త ల్లులు పిల్లలు చూసి తిలకించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ లు సుజాత, సావిత్రి,ఆర్ కె ఎమ్ లక్ష్మి అంగన్వాడి సిబ్బంది, ఆశా కార్యకర్త తేజవత్ కనకమ్మ,తదితరులు పాల్గొన్నారు.