ఇంకుడు గుంతలు ఉంటేనే ఇంటికి అనుమతి హడ్కో అవార్డును అందుకున్న కేటీఆర్‌

5

న్యూఢిల్లీ,ఏప్రిల్‌25(జనంసాక్షి):

సీఎం కేసీఆర్‌ ప్రభుత్వ పనితీరుకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి వ్యాఖ్యలే నిరద్శనమని రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డు(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి)కు ప్రతిష్టాత్మక హడ్కో అవార్డు అభించిన విషయం తెలిసిందే. ఈ అవార్డును మంత్రి కేటీఆర్‌ సోమవారం  ఢిల్లీలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడి చేతుల విూదుగా అందుకున్నారు. అనంతరం మంత్రి విూడియా ద్వారా మాట్లాడుతూ..హడ్కో నుంచి వరుసగా రెండోసారి అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.  గతేడాది మిషన్‌ భగీరథ, ఈ ఏడాది మెట్రో వాటర్‌ బోర్డుకు అవార్డు రావడం సంతోషకరంగా ఉందన్నారు. ఇది ప్రభుత్‌ంవ పనితీరుకు నిదర్శనమన్నారు. నల్లా ద్వారా నీటి చౌర్యాన్ని అరికట్టడంలో అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఫలితాలు సాధిస్తామని అన్నారు. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి నిర్వహణలో ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నం. ఆధునిక పరిజ్ఞానంతోనే ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నం. ఇంకుడు గుంతల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ విధానాలను కేంద్రమంత్రి వెంకయ్యనాయడు ప్రశంసించారు. పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వ కృషిని అవార్డు ప్రదానోత్సవంలో వెంకయ్యనాయుడు వివరించారు. కేంద్రమంత్రి వ్యాఖ్యలే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని కెటిఆర్‌ వ్యాఖ్యానించారు.  ప్రతి నూతన భవనానికి ఇంకుడు గుంతలు తప్పనిసరి చేయాలనే యోచనలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. కాగా నగర మౌలిక వసతుల ఏర్పాటులో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బి చేపట్టిన ప్రయోగాత్మక పథకాలను హడ్కో ఛైర్మన్‌ ఎం. రవికాంత్‌ ప్రసంశించారు. రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ రాష్టాన్రికి ప్రకటించిన హడ్కో అవార్డును డు ఢిల్లీలో అందుకున్నారు. పట్టణ ఇళ్ల నిర్మాణంలో అద్భుత ప్రగతి సాధించినందుకుగాను పురస్కారం అందజేసారు.  అదేవిధంగా హైదరాబాద్‌లో పౌరుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సౌకర్యాలను కల్పించినందుకు హైదరాబాద్‌ మెట్రోవాటర్‌ సప్లయ్‌ అండ్‌ సీవరేజ్‌ బోర్డుకు ప్రతిష్టాత్మక హడ్కో అవార్డు అభించింది.వారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందించిన కేసీఆర్‌ హడ్కో 46వ వ్యవస్థాపక దినోత్సవం ఢిల్లీలోని ఇండియన్‌ హాబిటాట్‌ సెంటర్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరై మంత్రి కేటీఆర్‌కు అవార్డును బహుకరించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. ప్రతి వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారితనం కచ్చితంగా ఉండాలి. పనుల మంజూరు విషయంలో ఎవరైనా కేంద్రమంత్రిని సంప్రదించవచ్చు. కేంద్రమంత్రిత్వశాఖను సంప్రదించకపోతే పనులు సక్రమంగా జరిగినట్టేనని ఆయన పేర్కొన్నారు.