ఇక ఈ-పల్లెలు

1

దోమకొండ తొలి పంచాయితీ

పథకాలన్నీ ఒకటే గొడుగు కిందికి

మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి3(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా దోమకొండలో ఈ పంచాయతీ పథకం ప్రారంభిస్తామని తెలంగాణ పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. త్వరలో అన్నింటినీ ఈ పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఈ పంచాయతీలకోసం జీశాట్‌, ఫైబర్‌ ఆ/-టపిక్‌లను ఏర్పాటుచేస్తామన్నారు. ఇందుకోసం సర్వీస్‌ ప్రొవైడర్లు, సేవా ఏజెంట్లతో చర్చించామని, జూన్‌ 2 లోగా నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. గ్రామాల్లో చదువుకున్న మహిళలతోనే ఈ పంచాయతీలను నిర్వహిస్తామన్నారు. ఈ పంచాయతీల ద్వారా చెల్లింపులు, ప్రభుత్వ పథకాల అమలు చేపడతామని తెలిపారు. త్వరలో అన్నింటినీ ఈ పంచాయతీలుగా మారుస్తామని ఆయన చెప్పారు. దోమకొండ మండలంలో మొదట ఈ కార్యక్రమాన్ని మొదట ప్రారంభించి, త్వరలో అన్ని ఈ-పంచాయితీలున్న జిల్లాగా నిజామాబాద్‌ ను అభివృద్ది చేస్తామని అన్నారు. ఈ-పంచాయితీల ద్వారానే పౌరసేవలు, పధకాల నగదు చెల్లింపులు చేపడతామన్నారు. గ్రామాల్లో ఈ-గవర్నెన్సుకి ఈ-పంచాయితీల ఏర్పాటు నాంది అని మంత్రి అన్నారు.  తెలంగాణ పల్లె ప్రగతి ద్వారా 150 మండలాల్లో ఈ-పంచాయితీల ఏర్పాటు, దశల వారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. మారుమూల గ్రామాలకి సైతం ఈ-గవర్నెన్స్‌ ఫలాలను తీసుకెళ్లెందుకు ఉద్దేశించిన ఈ-పంచాయితీల ఏర్పాటు కార్యక్రమాన్ని నిజామాబాద్‌ జిల్లా నుంచి శ్రీకారం చుట్టనున్నట్లు  తారకరామారావు తెలిపారు. ఈ-పంచాయితీల ఏర్పాటుకి తాము ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలిపిన మంత్రి… నిజామాబాద్‌ జిల్లాలోని దోమకొండ మండలంలో మొదట ఈకర్యక్రమాన్ని మొదట ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. ఈ-పంచాయితీల తో గ్రామాల్లోని ప్రజలకి పలు పౌరసేవలను సులభంగా అందించేందుకు వీలు కలుగుతుందని ఆయన అన్నారు. గ్రామాల్లోని ప్రజలు తమ వినియోగ సేవల బిల్లులతో పాటు పలు రకాల పన్నులను ఈ కేంద్రాల్లో చెల్లించగలుగుతారన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేయబోయే ఈ ఈ-పంచాయితీలు అనేక రకాల సేవలను ఒకే చోట అందించే ‘ఒన్‌స్టాప్‌షాప్‌’ లాగా పనిచేస్తాయని తెలిపారు. గ్రామాల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న పధకాలు, సంక్షేమ పధకాల నగదు చెల్లింపులను దశల వారీగా ఈ కేంద్రాల ద్వారా చెల్లించనున్నట్లు మంత్రి తెలియజేశారు. ఆసరా పించన్లు,ఉపాది హావిూ కూలీ చెల్లింపుల మొదలైన సేవలు ఈ-పంచాయితీల ద్వారా బలోపేతం చేస్తామన్నారు. గ్రామల్లోని ప్రజలకి రైతులకి ఈ-పంచాయితీల ద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని, ముఖ్యంగా రైతులకి పంటల ఉత్పత్తుల ధరలు, విద్యార్ధులకి, నిరుద్యోగ యువతకి ఈ కేంద్రాల ద్వారా ప్రతి సారి దగ్గరలోని పట్టనానికి వెళ్లాల్సిన ప్రయాస తప్పుతుందన్నారు. ఈ-పంచాయితీల ఏర్పాటు కోసం ఇప్పటికే పలువురు సర్వీసు ప్రోవైడర్లు, సేవా ఏజెంట్లు, ఈ పంచాయితీ సాప్ట్‌ వేర్‌ రూపకల్పన కోసం పలువురితో చర్చలు జరిపామన్నారు. ఈ-పంచాయితీల కనెక్టివీటి కోసం పలు విధానాలను పాటించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా వి శాట్‌ టెక్నాలజీ, ఫైబర్‌ ఆప్టీక్‌ కెబుల్‌ కనెక్టవీటటిని ఉపయోగించుకోబోతున్నట్లు మంత్రి తెలిపారు.మొట్టమొదట నిజామాబాద్‌ దోమకొండలో ఏర్పాటు చేయబోయే సేవలను మొత్తం మండలంలోని అన్ని గ్రామ పంచాయితీల్లో ప్రారంభం చేస్తామని, ఈ మేరకి పంచాయితీరాజ్‌ శాఖ కవిూషనర్‌ అనితా రాంచంద్రన్‌కి తగిన ఏర్పాటు,మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆమండలంలోని 18 గ్రామపంచాయితీల పరిధిలో చదువుకున్న మహిళ-యువతిని ఎంపిక చేసి వారికి ఈ పంచాయితీల నిర్వహాణకి శిక్షణ ఇవ్వాలన్నారు. ఈమండలంతో పాటు మరో రెండు మూడునెలల్లో మొత్తం జిల్లాలో ఉన్న మొత్తం 36 మండలాల్లోనూ ఈ సేవలను విస్తరిస్తామన్నారు. మొత్తం తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లా పూర్తిగా ఈ-పంచాయితీలు కలిగిన  జిల్లాగా మారబోతుందన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో కేంద్రం

ప్రభుత్వం చేపట్టిన జాతీయ ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ పధకంలో భాగంగా చేపట్టిన కనెక్టీవిటి పనులు త్వరలోనే పూర్తి కాబోతున్నాయని, అమేరకి జిల్లాలోని అన్ని పంచాయితీలకి ఇంటర్‌ నెట్‌ సౌకర్యాన్ని పొందుతాయని, దశల వారిగా ఈ సౌకర్యం కలిగిన తీరుగా ఆయా మండలాల్లో ఈ పంచాయితీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  ఇంటర్‌ నెట్‌ కనెక్టవీటి లేని చోట విశాట్‌ పరిజ్ఞానాన్ని వాడుకేంటున్నట్లు తెలిపారు. మొత్తం తెలంగాణలో జరుగుతున్న జాతీయ ఆప్టిక్‌ ఫైబర్‌ నెట్‌ వర్క్‌ పధకం పనులను సవిూక్షించిన మంత్రి కె.తారకరామారావు వాటిని మరింత వేగంగా పూర్తి చేయాలని కోరారు. వచ్చే జూన్‌ రెండు నాటికి నిజామాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మంజిల్లాల్లో ఈ పనులు పూర్తి చేయాలని, ఆయా జిల్లాల్లో ఈ-పంచాయితీలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా 150 మండలాల్లో ఈ పధకం కింద ఈ-పంచాయితీలను ఏర్పాటు చేయబోతున్నామని, మండలాల్లోనూ సాద్యమైనంత త్వరగా ఏర్పాటు చేస్తామన్నారు.