ఇచ్చిన మాట ప్రకారం శ్రీజా ఇంటికి కేసీఆర్
శ్రీజ ఇంట్లో సీఎం కేసీఆర్
ఖమ్మం చేరుకున్న సీఎం కేసీయార్.. తెలంగాణ సూపర్ కిడ్ శ్రీజను కలుసుకున్నారు. సీఎం కేసీయార్, ఎంపీ కవిత.. శ్రీజ ఇంటికి వెళ్లారు. సీఎం కేసీయార్ స్వయంగా తమ ఇంటికి రావడంతో.. శ్రీజ కుటంబం సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో శ్రీజ.. తనను అధికారిక నివాసంలో కలుసుకున్నప్పడు.. ఖమ్మం వచ్చినప్పుడు విూ ఇంటికి వస్తానని సీఎం కేసీయార్ మాట ఇచ్చారు.అలాగే తన వ్యక్తిగత ఖాతనుంచి 10 లక్షల రూపాయల చెక్ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు.. సీఎం.. ఇవాళ శ్రీజ ఇంటికి వెళ్లారు.