ఇది ఆఖరి పోరాటం
తెలంగాణ ప్రకటించేవరకు కదిలేది లేదు : కోదండరాం
హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించే వరకు నెక్లెస్ రోడ్డు సాగరహారాన్ని వదిలి వెళ్లేది లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటైన సాగరహారం వద్ద ఆయన మాట్లాడుతూ జేఏసీ వైఖరిని ప్రకటించారు. తెలంగాణ పోరాటం ఆఖరి దశకు చేరుకున్నదని తెలంగాణ తీసుకోకుండా తెలంగాణవాదులు ఎవరూ ఇంటికి పోరని ఆయన అన్నారు. పోలీసు బలగాల మోహరింపు, నిర్భందాన్ని ఛేదించుకొని నక్లెస్ రోడ్డుకు తరలివచ్చిన తెలంగాణ వాదుల్ని కోదండరాం అభినందించారు. ప్రభుత్వం అనుమతిచ్చి మాటతప్పి నిర్భందాన్ని ప్రయోగించినా తెలంగాణవాదులు ఎవరూ మాట తప్పబోరని శాంతియుతంగానే మార్చ్ కొనసాగిస్తామని భవిష్యత్ కార్యాచరణ మరి కాసెపట్లో ప్రకటిస్తామని అప్పటి వరకు తెలంగాణవాదులు నెక్లెస్‌్ రోడ్డుపైనే కూర్చుంటామని ఆయన ప్రకటించారు.