ఇరు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో..

4

– గవర్నర్‌ నరసింహన్‌

ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు

న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 19(జనంసాక్షి):తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలు, ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తున్నారని, అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. ఇలాగే కొనసాగితే అద్భుత ఫలితాలు వస్తాయన్నారు. ఢిల్లీలో కేంద్ర ¬ంమంత్రి రాజ్‌ నాథ్‌ సింగ్‌ తో, ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మెహ్రిషితో భేటీ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.ఢిల్లీ పర్యటన సాధారణమైనదే.. ఎలాంటి ప్రత్యేకత లేదని గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. ఇరు రాష్టాల్ర ముఖ్యమంత్రులు బాగా పనిచేస్తురని కితాబునిచ్చారు. . రెండు రాష్టాల్రు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాయన్నారు.  వీలైతే ప్రధానిని కలుస్తానన్నారు. తన ఢిల్లీ పర్యటన సాధారణమైందేనని, ఎటువంటి ప్రత్యేకత లేదన్నారు గవర్నర్‌. ఏపీ పునర్విభజన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి పరిష్కారం అవుతాయని అన్నారు. ఉద్యోగులు ఏవిూ ఆందోళనగా లేరని, చిన్నచిన్న వాగ్వాదాలు సహజం.. వాటిని పెద్దవి చేయకండని విూడియాకు సూచించారు. నిన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన విషయం ప్రస్తావించగా.. మర్యాద పూర్వకంగానే కలిశానని, హైదరాబాద్‌ వచ్చినప్పుడు కలవమన్నారని గవర్నర్‌ చెప్పారు. ఆంధప్రదేవ్‌ పునర్‌వ్యవస్థీకరణ బిల్లులోని సమస్యలు ఒక్కొక్కటీ పరిష్కారమవుతాయని వెల్లడించారు. కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ¬ంశాఖ కార్యదర్శిలతో గవర్నర్‌ సమావేశమయ్యారు. సీజేఐను మర్యాదపూర్వకంగా కలిశానని చెప్పారు.