ఇరోమ్‌షర్మిళకు ఊరట

1

న్యూదిల్లీ,మార్చి30(జనంసాక్షి):మణిపూర్‌ మానవహక్కుల పోరాట కార్యకర్త ఇరోం షర్మిలకు ఈరోజు దిల్లీ కోర్టులో వూరట లభించింది. ఆత్మహత్యాయత్నం నేరంలో షర్మిలను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మణిపూర్‌లో సాయుధ దళాల ప్రత్యేక హక్కు0ల చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇరోం షర్మిల గత 15ఏళ్లుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఆమెను ఆత్మహత్యాయత్నం నేరం కింద పోలీసులు అరెస్టు చేసి ముక్కు ద్వారా ద్రవపదార్థాలు పంపిస్తున్నారు.దిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద షర్మిల నిరాహార దీక్ష చేపట్టిన కారణంగా 2006లో షర్మిలపై ఆత్మహత్యా యత్నం కింద కేసు రిజిస్టర్‌ అయ్యింది. 2013 మార్చిలో కోర్టు షర్మిల కేసుకు సంబంధించి అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టింది. విచారణ అనంతరం ఈ రోజు షర్మిలను నిర్దోషిగా ప్రకటించింది.