ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి అడుగుకొక గుంత
— పగలు సర్కస్ ఫీట్లు- రాత్రి పల్టీలు కొట్టుడు
— ప్రాణాలు గ్యారెంటీ లేని ప్రయాణాలు
— నిమ్మకు నీరెత్తినట్లు సంబంధిత అధికారులు
టేకులపల్లి, సెప్టెంబర్ 13( జనం సాక్షి): ఇల్లందు, కొత్తగూడెం ప్రధాన రహదారి అడుగుకొక గుంత ఏర్పడి ప్రయాణాలలో ప్రజల ప్రాణాలు హరిస్తున్న, నెలల తరబడి రహదారి పొడవున గుంతలతో అస్తవ్యస్తంగా ప్రమాద భరితంగా తయారైన సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. అక్కడక్కడ రహదారిలో రెండు మూడు అడుగుల లోతైన గుంతలతో ఏర్పడి వాహనదారులు పడిపోతూ ఘోర ప్రమాదాలు జరుగుతున్నాయి. పగలు ప్రయాణం చేసే వాహనదారులు గుంతలను తప్పించడానికి సర్కస్ ఫీట్లు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక రాత్రి సమయాలలో ప్రయాణాలు చేసే వారి పరిస్థితి మరీ దారుణంగా మారాయి. ఎందరో వాహనదారులు గుంతలలో పడి పల్టీలు కొడుతూ గాయాలు పాలవుతున్నారు. ఈ రహదారిపై ప్రయాణాలు చేయాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 24 గంటలు రద్దీగా ఉండే ఈ రహదారి ఇంత దారుణంగా ఏర్పడ్డ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం శోచనీయం. ఎప్పుడో అరకొర మరమ్మత్తులు అక్కడక్కడ చేపడితే పట్టుమని పది రోజులు కూడా నిలవని మరమ్మత్తులు చేపడుతూ లక్షలాది రూపాయల నిధులు అధికారులు కాంట్రాక్టర్లు కొమ్మక్కై మింగుతుంటారు. మరమ్మత్తులు చేస్తే కనీస పర్యవేక్షణ కూడా ఉండకపోవడం ఇష్టరాజ్యంగా నాణ్యత లేకుండా కాస్తంత మట్టి పోసి గుంతలు పూడుస్తుంటారు. ఇది రోడ్లు భవనాల శాఖ రహదారుల పనితీరు. నెలల తరబడి ఇంత రద్దీగా ఉండే ప్రధాన రహదారిపై భయంకరమైన గుంతలు ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు గురవుతుంటే అధికార పార్టీకి చెందిన ఈ ప్రధాన రహదారికి మధ్యలో గల టేకులపల్లి మండలానికి చెందిన ఎమ్మెల్యే జడ్పీ చైర్ పర్సన్ లు ఉండి కూడా ఈ రహదార�