ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తప్పవు: ఎస్సై డి. సుధాకర్
జనంసాక్షి / చిగురుమామిడి – సెప్టెంబర్ 6:
చిగురుమామిడి మండలంలో గల మోయతుమ్మేద వాగు నుండి ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంగళవారం ఎస్సై డి.సుధాకర్ తెలిపారు.
రాత్రిపూట లేదా పగలు మైనింగ్, రెవెన్యూ అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా ఇసుకని రవాణా చేసినట్లయితే చట్టరీత్య చర్య తీసుకోవడం జరుగుతుందని అలా ఎవరైనా రవాణా చేస్తే వెంటనే చిగురుమామిడి పోలీస్ స్టేషన్ గాని డయల్ 100 ద్వారా గాని సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా రామంచ గ్రామ అనుబంధ గ్రామమైన నరసింహులపల్లిలో గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి కమ్యూనిటీ పోలీసు గురించి వివరిస్తూ గ్రామంలో ఏవైనా అసాంఘిక కార్యక్రమాలు జరిగిన పోలీసులకు సమాచారం ఇయ్యాలని, సైబర్ నేరాల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఇసుక, గుట్కా, పేకాట, గంజాయి గురించి పోలీసు లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో ఎస్సై తో పాటు సిబ్బంది ఒదయ్య, పోషన్ బాబు, రమేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.