ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం

4

– ఎవరినీ ఉపేక్షించం

– సభలో మంత్రి హరీశ్‌ రావు

హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):  ఇసుక పాలసీ ద్వారా తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నామని తెలంగాణ శాసనభలో మంత్రి హరీష్‌రావు  వెల్లడించారు. గతంతో పోలిస్తే తక్కువ ధరలకు ఇసుకను లభ్యమయ్యేలా అందుబాటులోకి  తెచ్చామన్నారు. దీంతో ఆన్‌లైన్‌లో కూడా ఇసుకను బుక్‌ చేసుకునే అవకాశం వచ్చిందన్నారు. మాన్యుఫ్యాక్చరింగ్‌ ఇసుకను కూడా ప్రోత్సహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఇసుక ధరలను కట్టడి చేయలేదని, గతంలో లారీ ఇసుక రూ.35 వేలు ఉంటే, .ప్రస్తుతం లారీ ఇసుక రూ.11 వేలు అని మంత్రి చెప్పారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇసుక అక్రమ రవాణా చేస్తూ మూడో సారి తప్పు చేస్తే కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేస్తామని  హరీష్‌రావు వివరించారు. ఎవరైనా అక్రమాలపై ఫిర్యాదు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. శాసనసభ సమావేశాల్లో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఇసుక విధానంపై పలువురు సభ్యులు  సభ దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రభుత్వ విధానం వల్ల ఇసుక దొరక్కుండా పోయిందని గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ అన్నారు. పాలమూరు జిల్లాలో భవన నిర్మాణాలు నిలిచి పోయాయని అన్నారు. ఇసుక ధరలు అందకుండా పోయాయని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మాట్లాడుతూ అక్రమ ఇసుక దందా కొనసాగుతోందన్నారు. పేదలకు ఇసుక అందడం లేదని సంపత్‌ కుమార్‌ అన్నారు. ఇసుక పాలసీపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరవాత రాష్ట్రంలో తొలిసారిగా ఇసుక విధానం ప్రవేశపెట్టినంటలు వెల్లడించారు.  ఇసుక అక్రమ రవాణాను అరికట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రం ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మాన్యుఫ్యాక్టరింగ్‌ ఇసుకను కూడా ప్రోత్సహిస్తున్నాం. గతంలో లారీ ఇసుక రూ.35 వేలు ఉంటే ప్రస్తుతం ఇసుక రూ.11 వేలు ఉందని తెలిపారు. ఇసుక పాలసీ ద్వారా తక్కువ ధరకే ఇసుక ఇందిస్తున్నాం. గత ప్రభుత్వాలు ఇసుక ధరలను కట్టడి చేయలేదు. దీంతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా రాలేదన్నారు. ఇసుక మాఫియాపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై రూ.11కోట్ల ఫెనాల్టీలు వేసినట్లు వెల్లడించారు.  మూడో సారి తప్పు చేస్తే కేసు నమోదు చేసి వాహనం సీజ్‌ చేశామని వెల్లడించారు. ఆన్‌లైన్‌ ద్వారా ఇసుకను బుక్‌ చేసుకునే అవకాశం కల్పించాం. ఇసుక మాఫియాపై ఫిర్యాదుకు కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసినం. ఇసుక మాఫియాపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎవరు ఫిర్యాదు చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.