ఈనెల 13న జరిగే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయండి

టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ హరిలాల్
టేకులపల్లి సెప్టెంబర్ 11( జనం సాక్షి ): ఈనెల 13న జరిగే అసెంబ్లీ ముట్టడిని జయప్రదం చేయాలని టి పి టి ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోతు హరిలాల్ పిలుపునిచ్చారు . ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ దసరా సెలవులలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు నిర్వహించాలని, టిఆర్టి నిర్వహించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలని,నియామకాలు జరిగే వరకు విద్యా వాలంటీర్లను నియమించాలని, జీవో 317 స్పౌజ్ , అన్ని అప్పిళ్ళను పరిష్కరించాలని సిపిఎస్ ను రద్దుచేసి, ఓ పి ఎస్ ను అమలు చేయాలని,పాఠశాలల్లో సర్వీస్ పర్సన్స్ ను నియమించాలని డిమాండ్ చేశారు. అందుకు చేపట్టే ఈనెల 13న జరిగే అసెంబ్లీ ముట్టడికి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు .ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు నిర్వహిస్తామని,సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అనేకసార్లు చెప్పినప్పటికీ ఆచరణలో జరగలేనందున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేయడం జరుగుతుందని,బదిలీలు పదోన్నతులు లేక ఉపాధ్యాయులు అనేక సమస్యలను ఎదుర్కొంటూ నష్టపోతున్నారని,ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు నష్టపోతున్నారన్నారు.కావున ఉపాధ్యాయులు ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.