ఈ నెలఖరుకు భగీరథ ఫలాలు

4

– మెదక్‌, రంగారెడ్డి జిల్లాలకు నళ్లా నీళ్లు

– మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 7(జనంసాక్షి):తెలంగాణలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ భగీరథ ఫలాలు ఏప్రిల్‌ మాసాంతానికి ఖచ్చితంగా అందబోతున్నాయని ఎంసీహెచ్‌ఆర్డీలో హెచ్‌ఎండీఏ ఆరో బోర్డు సమావేశం జరిగింది.మిషన్‌ భగీరథ పనులపై మంత్రి కేటీఆర్‌ సవిూక్ష సమావేశం నిర్వహించారు.ముఖ్యమంత్రి చేతుల విూదుగా తెలంగాణ ప్రజలకి రక్షిత మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేశారు. వచ్చే ఎండాకాలం నాటికి నల్లగొండలోని ఫ్లోరైడ్‌ పీడిత మునుగోడు, దేవరకొండ ప్రాంతాలకి రక్షిత తాగునీరు వస్తుందన్నారు. నిర్ధేశిత లక్ష్యాల మేరకి ప్రాజెక్టు పనులు నడుస్తున్నాయన్నాయని, అయితే రాబోయే రోజుల్లో మరింత వేగంగా పనులు చేయాలన్నారు. ఈసారి త్వరగా వర్షాలు వస్తాయన్న సూచనలున్న నేపథ్యంలో అన్ని ఇంటెక్‌ వెల్స్‌ నిర్మాణం సేఫ్‌ స్టేజీకి తేవాలన్నారు.దేశమంతా తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుపైన దృష్టి సారించిందని, ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీన నీతి ఆయోగ్‌ బృందం మిషన్‌ భగీరథ గురించి ప్రత్యేకంగా తెలుసుకునేందుకు నగరానికి వస్తుందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.మిషన్‌ భగీరథలో భాగంగా త్వరలోనే నిజామాబాద్‌, ఖమ్మంలో రెండవ దశలో నీళ్లు ఇచ్చే గ్రామాల్లో బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఫైబర్‌ గ్రిడ్‌ ద్వారా అయా గ్రామాల్లో ఈ-హెల్త్‌, ఈ-విద్యా కార్యకమాలకి రూపకల్పన చేయాలని మంత్రి ఐటి శాఖ అధికారులని అదేశించారు. ఈ సమావేశంలో ఈఎన్సీ బి.సురేందర్‌ రెడ్డితోపాటు ఐటి, ఆర్‌.డబ్ల్యు.యస్‌ అధికారులు పాల్గొన్నారు.

ఫైబర్‌ గ్రిడ్‌కు రెండు వారాల్లో టెండర్లు

ఆర్థిక వనరులు పెంపుతో పంచాయతీలను బలోపేతం చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తొలిదశ నీళ్లిచ్చే నియోజకవర్గాల్లో ఫైబర్‌గ్రిడ్‌ పనుల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆర్థిక వనరులు పెంపుతో పంచాయతీలను బలోపేతం చేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సమావేశంలో మంత్రి కేటీఆర్‌, అధికారులు పాల్గొన్నారు.తొలిదశ నీళ్లిచ్చే నియోజకవర్గాల్లో ఫైబర్‌గ్రిడ్‌ పనుల ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఫైబర్‌ గ్రిడ్‌కు రెండు వారాల్లో టెండర్లు పూర్తి చేసి పనులు ప్రారంభించాలి. భారత్‌ నెట్‌ పథకంలో ఇప్పటికే కొన్ని జిల్లాల్లో ఫైబర్‌ సౌకర్యం ఉంది. నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో 80శాతం గ్రామాలకు ఫైబర్‌ సౌకర్యం వచ్చింది. ఇంటింటికి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కార్యక్రమంలో అధికారులు లక్ష్యం నిర్ధేశించుకోవాలని మంత్రి కేటీఆర్‌ సూచించారు.ఫైబర్‌గ్రిడ్‌ ఉన్న గ్రామాల్లో ఈ ఆరోగ్యం, ఈ విద్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.మిషన్‌ భగీరథపై తెలుసుకునేందుకు ఈ నెల 12న నీతిఅయోగ్‌ బృందం హైదరాబాద్‌ రానుందని కేటీఆర్‌ తెలిపారు. బాహ్య వలయ రహదారిని శరవేగంగా పూర్తి చేస్తున్నామన్నారు. దీని చుట్టూ అభివృద్ధి కారిడార్‌ ఏర్పాటు కావాలని ఆయన అన్నారు. ఏప్రిల్‌ చివరి నాటికి కొన్ని నియోజకవర్గాల్లో నీరు అందిస్తాం. మిషన్‌ భగీరథపై తెలుసుకునేందుకు ఈ నెల 12న నీతిఅయోగ్‌ బృందం హైదరాబాద్‌ రానుందని కేటీఆర్‌ తెలిపారు. ఆరు నెలల్లో ఇంటింటికి ఇంటర్నెట్‌ అందుబాటులోకి వస్తుందని చెప్పారు.  ఈ సమావేశంలో ప్రాజెక్టు పనులు జరుగుతున్నతీరుని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుతో పాటు కలిపి చేపట్టాల్సిన తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు ఏర్పాట్లపై ఆరా తీశారు ఫైబర్‌ గ్రిడ్‌ పూర్తయితే గ్రామాల్లో సమాచార విప్లవానికి పునాదులు పడుతాయని, తెలంగాణలోని ప్రతి పల్లెకి ప్రపంచస్ధాయి వైద్య, విద్యాసౌకర్యాలు అందే వీలు కలుగుతాయన్నారు.కేంద్ర ప్రభుత్వం సహాయంతో చేపట్టిన భారత్‌ నెట్‌ లో భాగంగా నిజామాబాద్‌, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే 80 శాతం గ్రామాలకి ఫైబర్‌ సౌకర్యం వచ్చిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో ఇంటింటికి ఇంటర్నెట్‌ అందించే కార్యక్రమంలో లక్ష్యాలు నిర్ధేశించుకోవాలన్నారు.