ఉగాది పురస్కార గ్రహీతల ఎంపిక

4

హైదరాబాద్‌,మార్చి18(జనంసాక్షి):  తెలంగాణ ప్రభుత్వంలో ఉగాది వేడుకలు నిర్వహించడం ఇదే ప్రథమ కావడంతో పలువురికి అవార్డులను ప్రకటించింది. అంతేగాకుండా ఉగాది ఫర్మానాను కూడా పెంచింది. గత ప్రభుత్వాల్లాగే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా ఉగాది పురస్కారాలను అందజేయడానికి సర్వం సిద్ధం చేసింది. అయితే తెలంగాణలో ఉన్న అన్ని కళలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఉగాది పురస్కారాలను ఉగాది పర్వదినంన అందజేయనున్నారు. ఉగాది పురస్కారాల గ్రహీతలను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికకు సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారు. ఉగాది పురస్కార గ్రహీతల జాబితాను కూడా ప్రకటించారు.  సాహిత్య రంగం – ముదిగంటి సుజాతారెడ్డి, మలయశ్రీ, గోరటి వెంకన్న

సంగీతం – రామలక్ష్మి, రంగాచారి, రాజగోపాలచారి,నృత్యం –  సుధీర్‌రావు, రత్న శ్రీ

నాటకం – దాసరి అమరేందర్‌, ఒగ్గుకథ – శ్రీ ఒగ్గు ధర్మయ్య, మిమిక్రి – సదాశివ్‌, చిత్రకళ –  సూర్య ప్రకాశ్‌, శ్రీమతి అంజనీ రెడ్డి, శిల్పకళ – శ్రీనివాసరెడ్డి,  పాండు,పేరిణి నృత్యం – పేరిణి రమేశ్‌, జానపద సంగీతం –  వడ్డేపల్లి శ్రీనివాస్‌, జానపద కళా రూప ప్రదర్శన – శ్రీదర్శనం మొగులయ్య(పన్నెండు మెట్ల కిన్నెర)

హరికథ – పద్మాలయాచార్య,బుర్రకథ – బి. సరోజినీ,చిందు యక్షగానం – చిందు పెదబాబయ్య

టీవీ రంగం – నాగబాల సురేశ్‌, సినిమారంగం – ఎన్‌. శంకర్‌, భూపాల్‌రెడ్డి, జానపద చిత్రకళ – ప్రకాశ్‌ వైకుంఠం, చెర్యాల,హస్తకళ – నల్ల విజయ్‌, హుజురమ్మ, కళాశ్రమం – రవీంద్ర శర్మ,వేద పరిశోధన – యం.వి. నరసింహారెడ్డి లను ఎంపికచేశారు.