ఉగ్రవాదం అణ్వస్త్రం కంటే ప్రమాదం..ప్రధాని మోదీ

3
బెర్లిన్‌లో ప్రధాని మోదీ

బెర్లిన్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి):  జర్మనీ పర్యటనలో ఉన్న  భారత ప్రధాని మోదీ.. భారత్‌ ఆర్థికంగా బలపడుతున్నదని, అయితే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నవారు ఆలోచించుకోవాలని హితవుపలికారు.  మానవ మనుగడకు ఉగ్రవాదం పెనుభూతంలా మారిందని ప్రధాని పేర్కొన్నారు. అణ్వాయుధాలకంటే ప్రమాదకరమైన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నవారు ఆలోచించుకోవాలన్నారు. ప్రభుత్వాలు మానవ రక్షణకోసం పనిచేయాలని, ఉగ్రవాద నిర్మూలనలో జర్మనీ కలిసి వస్తుందని ఆశిస్తున్నానని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌, జర్మనీకి శాశ్వత సభ్యత్వం లభిస్తుందని ఆశిస్తున్నామన్నారు.  ఆర్థికంగా భారత్‌ ఎంతో బలపడుతోందని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు.మేక్‌ఇన్‌ ఇండియాలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామని తెలిపారు.  బెర్లిన్‌లో మోడీ, జర్మనీ ఛాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ సంయుక్త విూడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. భారత్‌ తయారీ రంగంలో జర్మనీ పెట్టుబడులకు అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు.  భారత్‌ – జర్మన్‌ సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కావాలన్నారు. అభివృద్ధిలో పెట్టుబడులే ఎంతో కీలకమని పేర్కొన్నారు. ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధిలో జర్మనీ ముందుందన్నారు. నైపుణ్యాభివృద్ధిలో భారత్‌ కూడా ప్రగతిపథంలో ఉందని తెలిపారు. తయారీ రంగంలో భారత్‌ అభివృద్ధి బాటలో పయనిస్తోందని పేర్కొన్న ప్రధాని,  జర్మన్‌ – భారత్‌ కలిసి పని చేస్తే ఇంకా మంచి ఫలితాలు సాధించగలమని సూచించారు. ఏంజెలా మెర్కెల్‌ భారత్‌ పర్యటించాలని కోరుతున్నానని తెలిపారు.భారత్‌-జర్మనీ సంబంధాలు భవిష్యత్‌లో మరింత బలోపేతం కావాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. భారత్‌-జర్మనీ ఒప్పందాలపై మనసు విప్పి మాట్లాడుకున్నామని, భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అంగీకరించినందుకు సంతోషకరమని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం నాడు బెర్లిన్‌లో పర్యటించిన ఆయన జర్మన్‌ చాన్సలర్‌ ఎంజెలా మెర్కెల్‌తో కలిసి విూడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ మెర్కెల్‌ ఆత్మీయ స్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు. నైపుణ్యాభివృద్ధిలో జర్మనీ ఎంతో ముందుందన్న జర్మనీ నుంచి భారత్‌ నేర్చుకోవాల్సింది చాలా ఉందని మోదీ పేర్కొన్నారు.జర్మన్‌ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ని భారత్‌లో పర్యటించాలని కోరారు. ‘భారత్‌లో తయారీ’లో పెట్టుబడులకు అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌- జర్మనీ సంబంధాలు మున్ముందు మరింత బలోపేతం కావాలన్నారు. ప్రపంచంలో నైపుణ్యాభివృద్ధిలో జర్మనీ ముందుందని, ఇప్పుడు భారత్‌ కూడా ప్రగతి పథంలో సాగుతోందని మోదీ అన్నారు. ఆర్థికంగా భారత్‌ ఎంతో బలపడుతోందని, ఆర్థిక రంగంలో ప్రపంచానికి భారత్‌ దిశానిర్దేశర చేయబోతోందన్నారు. అభివృద్ధిలో పెట్టుబడులే ఎంతో కీలకమని మోదీ పేర్కొన్నారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో పెట్టుబడులకు ఆహ్వానం పలుకుతున్నామన్నారు.