ఉచిత ప్రమాద బీమా
-జర్నలిస్టులు, డ్రైవర్లు, హోంగార్డులు
– సీఎం కేసీఆర్
హైదరాబాద్,మే1 (జనంసాక్షి): తెలంగాణలో ఉన్న డ్రైవర్లకు ప్రమాద బీమా అమలు చేస్తామని తెలంగాణ సిఎం కెసిఆర్ హావిూఇచ్చారు. దీనివల్ల ఐదు లక్షల ఎనిమిది వేల మంది డ్రైవర్లకు ఈ పథకం వర్తించనుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా కల్పిస్తామని కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 5లక్షలకు పైగా డ్రైవర్లు ఉన్నారని, వారందరికీ ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందన్నారు. ¬ంగార్డులు, పాత్రికేయులకు ప్రభుత్వమే ప్రమాద బీమా కల్పిస్తుందన్నారు. యువతకు నైపుణ్యాభివృద్ధి ద్వారా ఉద్యోగం, ఉపాధి దొరుకుతుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం దేశంలో అనేకమంది నాయకులు పోరాడారని గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆటోలపై పన్ను రద్దు చేశామని, బీడీ కార్మికులకు రూ.1000 జీవన భృతి ఇస్తున్నామని తెలిపారు. 6 వేల మంది ¬ంగార్డులకు, 12 వేల మంది జర్నలిస్టులకు ఐదు లక్షల ప్రమాద బీమా ఈ రోజు నుంచి వర్తిస్తుందన్నారు. ప్రసూతి సమయంలో చేసే ఆర్థిక సాయం 10 వేల నుంచి 20 వేలకు పెంచనున్నట్లు చెప్పారు. సహజ మరణం పాలైన వారి కుంటుంబాలకు ఆర్థిక సహాయం 30 వేల నుంచి 60 వేలకు పెంపు. యాక్సిడెంట్‌లో అసువులు బాసిన వారికిచ్చే ఆర్థిక సాయం రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంపు వంటి వరాలు ప్రకటించారు. ఆటో రిక్షాలపై పన్ను రద్దు చేశామని,అంతకు ముందు ఉన్న బకాయిలు రద్దు చేశామని తెలిపారు. రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వం మేడే వేడుకలు ఘనంగా నిర్వహించింది. వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఇతర రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సందర్భంగా సీఎం కేసీఆర్ కార్మిక లోకానికి వరాల జల్లు కురిపించారు. బీడీ కార్మికులకు నెలకు రూ.1000 భృతి ఇస్తున్నాం. దీంతో మూడు లక్షల 70వేల మందికి ప్రయోజనం చేకూరుతుంది. స్కిల్‌డెవెలప్‌మెంట్‌కు కేంద్రం నిధులు కేటాయించాలి. కార్మికుల సొమ్మును వడ్డీ కోసం బ్యాంకుల్లో దాచడం కరెక్టు కాదు. ఆనాడు తాను కేంద్ర కార్మికమంత్రిగా ఉన్న సమయంలో ప్రధానిని ఒప్పించి శ్రామిక్ కళ్యాణ్ యోజన పథకాన్ని తెచ్చినట్లు వెల్లడించారు. శ్రామిక్‌కళ్యాణ్ యోజన కార్మిక కుటుంబాలను ఆదుకుంటున్నామని అన్నారు. స్కిల్ బిల్డింగ్ సెంటర్లు రావాలి. స్కిల్ డెవెలప్‌మెంట్‌కు కేంద్రం నిధులు కేటాయించాలని సీఎం కోరారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాకో స్కిల్ బిల్డింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఉత్పాదకరంగంలో చాలా మందికి అవకాశాలు వస్తాయి. న్యాక్‌ను మరింత విస్తరిస్తాం. భారీ యంత్రాల కార్మాగారం పెట్టాలని నీతి ఆయోగ్‌లో తాను ప్రతిపాదిస్తానని తెలిపారు.
గతప్రభుత్వ నిర్వాకం వల్లనే హెచ్‌ఎంటి మూత
గత ప్రభుత్వాల తెలివి తక్కువతనాల వల్ల ఉన్న ఒక్క హెచ్‌ఎంటీ మూతపడింది. ఇండియాలో హెవీ మిషన్ టూల్స్ కార్మాగారం ఒక్కటీ లేకపోవడం సిగ్గుచేటు. హెవీ మిషన్స్ తయారు చేసే కార్మాగారాలు వస్తే ఎన్నో ఉపాధి అవకాశాలు వస్తాయని కెసిఆర్ అన్నారు. భారతదేశంలో డిఫెన్స్ ఇండస్టీస్ర్‌లో హైదరాబాద్ రెండోస్థానం ఉంది. పేపర్ ఇంపోర్టు వల్ల ఇక్కడి పేపర్ పరిశ్రమలు దెబ్బతింటున్నాయన్నారు. విదేశాల నుంచి ఇంపోర్టు చేసుకోవడం బంద్ కావాలి. ప్లానింగ్ కమిషన్ మార్చి నీతిఆయోగ్ తీసుకురావడం మంచి పరిణామం. ఇంతకు ముందు ప్రణాళిక సంఘంలో సీఎంల పరిస్థితి ఆగమాగం ఉండేది. ఇప్పుడు నీతి ఆయోగ్‌లో ముఖ్యమంత్రులంతా సభ్యులే కావడం వల్ల ప్రణాళికలో
భాగస్వామ్యం దక్కిందన్నారు. ఇంతకు ముందు కరెంటు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఇప్పడు కరెంటు కోతలు లేని రాష్ట్రంగా చూస్తున్నాం. ఇంతకు ముందు పారిశ్రామికవేత్తలు కరెంటు కోసం ధర్నాలు చేసేవాళ్లు. వచ్చే మార్చి నాటికి మరో మూడువేల మెగావాట్ల విద్యుత్ అదనంగా వస్తుందని మరోమారు తెలిపారు. తెలంగాణలో ఇక నుంచి కరెంటు కోతలు బంద్ అని అన్నారు. ఇక నుంచి రైతులకు కరెంటు తిప్పులు ఉండవు. రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్ ఇస్తున్నాం. కరెంటు కోసం నేను అర్వ తిప్పలు పడుతున్నా. పరిశ్రమలకు కోతలు ఉండవన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణకు రావాలని, కొత్త పరిశ్రమలతోనే కొత్త ఉద్యోగాలు వస్తాయిన్నారు. ప్రపంచంలోనే బెస్ట్ ఇండస్టియ్రల్ పాలసీని తీసుకొచ్చి. అసెంబ్లీలో చట్టం కూడా చేసినట్లు వివరించారు. . ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా సింగల్ విండో ఇండస్టియ్రల్ పాలసీ లాంఛ్ చేయబోతున్నాం. 15 రోజుల్లోపు అవసరమైన అన్ని అనుమతులు ఇస్తాం. ప్రపంచంలోని భారీ పరిశ్రమలన్నీ తెలంగాణకు క్యూ కట్టాలి. పరిశ్రల కోసం లక్ష 50 వేల ఎకరాల రెడీ చేసినం. తెలంగాణ పెట్టుబడి పెట్టేందుకు పరిశ్రమలు రాబోతున్నాయి. తెలంగాణ దేశంలోనే పెద్ద పారిశ్రామిక నగరంగా అభివృద్ధి చేందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రమదోపిడీకి పాల్పడితే చర్యలు: దత్తాత్రేయ
కేంద్రమంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ… కార్మికుల శ్రమను దోపిడీ చేయకూడదన్నారు. ఉద్యోగం, ఉపాధి కల్పన చాలా అవసరం. కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలన్నారు. కార్మిక చట్టాలను ఉల్లంఘించేవారిని ఊరుకోబమన్నారు. కార్మికులందరికీ దత్తత్రేయ మేడే శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులకు యాజమాన్యాలు కనీస వేతనం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపకల్పన చేసింది. కార్మికుల హక్కుల కోసం ట్రేడ్ యూనియన్లు సంఘటితం కావాలి. కార్మికుల శ్రమను యాజమాన్యాలు గుర్తించాలి. కార్మికుల సంక్షేమం కోసం ప్రధాని పోర్టల్ ప్రవేశపెట్టిన విషయం గుర్తు చేశారు.
కార్మికులకు అండగా ఉంటా: నాయిని
రాష్ట్ర ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ… ఈ రోజు కార్మికుల పండుగ, వందల ఏళ్ల పోరాటం ఫలితంగా కార్మికులకు కొంత స్వేచ్ఛ లభించింది. కార్మికులకు పూర్తి స్వేచ్చ ఇంకా రాలేదు. కార్మిక వర్గం దేశానికి వెన్నుముక. యూనియన్ పెట్టుకోవడం కార్మికుల హక్కు. ప్రపంచంలో ఎక్కడలేని బెస్ట్ ఇండస్టీయ్రల్ పాలసీ తెలంగాణలో అమలవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి వల్లే రాష్ట్రంలో కరెంటు కోతలు లేని రాష్ట్రంగా రూపొందించారని అన్నారు. కార్మికుల కష్టాన్ని యాజమాన్యాలు గుర్తించాలని, బంగారు తెలంగాణెళి మన ముందు ఉన్న లక్ష్యం. కార్మికుల జీవితాల్లో వెలుగులు చూడాలన్నదే సీఎం తపన. రెండేళ్లలో లక్ష ప్రభుత్వ ఉద్యోగాల నింపుతామని ఈ సందర్భంగా నాయిని ప్రకటించారు. కార్మికుల సంక్షేమంపై దృష్టి పెట్టాలన్నారు. కార్మికులను శ్రమయోగులుగా ప్రధాని పేర్కొన్నారని గుర్తు చేశారు.
సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన జర్నలిస్టులు
తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమాన్ని దఅఎ-ృష్టిలో పెట్టుకొని 12 వేల మంది జర్నలిస్టులకు మేడే కానుకగా రూ. ఐదు లక్షల ప్రమాద భీమా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ, జర్నలిస్ట్ సంఘాల నేతలు హర్షం ప్రకటించారు. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమం కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఓ వరమని అన్నారు. వృత్తి నిర్వహణలో ఎందరో ప్రమాదాలకు గురవుతున్న తరుణంలో ఇది ఆదుకోగలదన్నారు. వీరికి బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు సిఎం రవీంద్రభారతి మేడే వేడుకల్లో ప్రకటించారు. సిఎంకు కృతజ్ఞతలు తెలిపిన వారిలో శేఖర్, విరాహత్‌అలీ, కాంతి కిరణ్, రమణ ఉన్నారు.