ఉజ్జయిని కుంభమేళాలో తొక్కిసలాట
– తొమ్మిది మంది మృతి
ఉజ్జయిని,మే5(జనంసాక్షి):ఉజ్జయినిలో జరుగుతున్న కుంభమేళాలో అపశ్రుతి చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో భారీ వర్షం కురవడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగి తొమ్మిది మంది భక్తులు మరణించారు. మరో 70 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. కుంభమేళాకు అత్యంత పటిష్ఠంగా ఏర్పాట్లు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ముందునుంచి చెబుతున్నా, అనుకోకుండా అకాలవర్షం కురవడంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైన భక్తులు అటూ ఇటూ పరుగులు తీశారు. దాంతో తొక్కిసలాట జరిగి, ఏడుగురు మరణించారు. వెంటనే రంగంఓలకి దిగిన పోలీసులు మైకుల ద్వారా అప్రమత్తం చేశారు.