ఉత్తమ జాతీయ చిత్రంగా ”క్వీన్”
-ఎక్కువ విభాగాల్లో అవార్డు దక్కించుకున్న ”హైదర్”
-ఉత్తమ తెలుగు చిత్రంగా ”చందమామ”
-ప్రజాదరణ చిత్రంగా ”మేరికోమ్”
న్యూఢిల్లీ,మార్చి 24 (జనంసాక్షి): జాతీయ తెలుగు ఉత్తమ చలనచిత్రంగా చందమామ కధలు సినిమా ఎంపికైంది. జాతీయ స్థాయి ఉత్తమ సినిమాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. దాని ప్రకారం మరాఠీ సినిమా కోర్టు జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ముమ్ముట్టి జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా కంగనా రౌనత్ ఎంపికయ్యారు. కాగా హిందీ సినిమాలలో క్వీన్ ఎంపికైంది. ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా మేరీకోమ్ ఎంపికైంది. ఉత్తమ జాతీయ గాయకుడుగా సుక్విందర్ ఎంపికయ్యారు. వీరందరికి మేనెల మూడున రాష్ట్రపతి చేతుల విూదుగా అవార్డుల ప్రదానం జరుగుతుంది.
కేంద్రం 2014కుగాను 62వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. బాలీవుడ్ చిత్రం హైదర్ కు నాలుగు అవార్డులు లభించాయి. ఈ అవార్డులను మే 3న న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేయనున్నారు.
ఉత్తమ చిత్రం – కిల్లా (మరాఠీ) ,ఉత్తమ జాతీయ చిత్రం- క్వీన్,ఉత్తమ జాతీయ నటి- కంగనారనౌత్ (క్వీన్),
ఉత్తమ తెలుగు చిత్రం- చందమామకథలు, ఉత్తమ జాతీయ నటుడు- విజయ్ (కన్నడ), ఉత్తమ సహాయ నటుడు- బాబీ సిన్హా(తమిళ్),ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం- మేరీకోమ్, ఉత్తమ దర్శకుడు- శ్రీజిత్ ముఖర్జీ (బెంగాలీ), ఉత్తమ కొరియోగ్రాఫర్- హైదర్, ఉత్తమ నేపథ్యగాయకుడు: సుఖ్విందర్ సింగ్
బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా కేటగిరి- పసుపులేటి పూర్ణచందర్‌రావు ,ఉత్తమ యానిమేషన్ చిత్రం- సౌండ్ ఆఫ్ జాయ్ ,ఉత్తమ సినీ విమర్శకులు- తనుల్‌ఠాకూర్ ఎంపికయ్యారు.