ఉత్తరఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై హైకోర్టు స్టే

1

ఉత్తరఖండ్‌,మార్చి29(జనంసాక్షి):ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై స్టే విధించింది అక్కడి హైకోర్టు. ఈ నెల 31న శాసనసభలో విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఆదేశించిన ధర్మాసనం? బలనిరూపణలో పాల్గొనేందుకు అందరు ఎమ్మెల్యేలకు అనుమతిచ్చింది. ఉత్తరాఖండ్‌ హైకోర్టు తీర్పుతో సీఎం హరీష్‌ రావత్‌ కు ఊరట లభించింది.ఉత్తరాఖండ్‌ లో అధికార కాంగ్రెస్‌ కు చెందిన 9 మంది ఎమ్మెల్యేలు ప్రతిపక్ష బీజేపీతో చేతులు కలపడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ నెల 28న బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్‌ ఆదేశించగా.. ఒకరోజు ముందే కేంద్ర మంత్రివర్గం ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేసింది. దీంతో, ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతి పాలనకు ఆమోదించారు. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఎంతవరకు చెల్లుతాయన్న విూమాంస వ్యక్తమవుతోంది.