ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వండి
-మీకు సకల సౌకర్యాలు కల్పించాం
-మహేంద్ర కొత్త ప్లాంటు ప్రారంభించిన సీఎం కేసీఆర్
మెదక్, ఏప్రిల్ 22 (జనంసాక్షి):
జహీరాబాద్‌లో ఉన్న మహీంద్రా కంపెనీ స్థానికులకు ఉద్యోగాలిచ్చి హావిూని నిలబెట్టుకోవాలని సిఎం కెసిఆర్ సూచించారు. గాయపడ్డ తెలంగాణలో ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందన్నారు. కొట్లాడి రక్తమోడి తెలంగాణ తెచ్చుకున్నామని, ఈ దశలో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. జహీరాబాద్‌లోని మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కొత్త యూనిట్ ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తెలంగానకు నిలువెల్లా గాయాలేనని అన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని ఈ ప్రాంత ప్రజలు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని అన్నారు. వారికి ఉద్యోగావకాశాలు ఇవ్వాలన్నారు. తెలంగాణ చాలా గాయపడ్డ ప్రాంతం. ఎంతో కష్టపడి రాష్టాన్న్రి తెచ్చుకున్నాం. పరిశ్రమలు ఏది కోరితే అది ఇస్తున్నాం. కాబట్టి ఉద్యోగాలు మా పిల్లలకే ఇవ్వాలని సూచించారు. కంపెనీకి కావాల్సిన నీరు, విద్యుత్, భూమి ఇస్తున్నామని, మరేది అడిగినా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని సిఎం ప్రకటించారు. ప్రభుత్వం అన్నీ సమకూరుస్తున్నప్పుడు ఉద్యోగాలు కూడా స్థానికులకే చెందాలన్నారు. మహీంద్రా కంపెనీకి వ్యాట్‌లోనూ మినహాయింపు ఇస్తున్నామని ప్రకటించారు. ఇంకేదైనా సాయం అసవరమైన ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. విస్తరించిన కొద్దీ కొత్తవారికి ఉద్యోగాలు వస్తాయన్నారు. విూరు అభివృద్ది చెందండి.. తెలంగాణను అభివృద్ది చెందేలా చేయండని పిలపునిచ్చారు. జహీరాబాద్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా కొత్త యూనిట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్లాంట్‌ను సీఎం ప్రారంభించారు. మహీంద్రా కంపెనీ తయారు చేసిన నూతన వాహనాన్ని స్వయంగా నడిపి సీఎం లాంచ్ చేశారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ… కొత్త యూనిట్ ప్రారంభించిన మహీంద్రా యజమాన్యానికి అభినందనలు తెలిపారు. మహీంద్రాకు వ్యాట్ శాతం 5 శాతానికి తగ్గిస్తామని హావిూ ఇచ్చారు. మహీంద్రాకు అవసరమైన సహాకారం ప్రభుత్వం అందిస్తుంది. తెలంగాణలో కరెంటు కోతలు ఉండవు. కరెంటు కోతలు లేనందున పరిశ్రమలు విస్తరించుకోవాలని సీఎం సూచించారు. త్వరలో 24 గంటలు నాణ్యమైన కరెంటు అందిస్తామని హావిూ ఇచ్చారు. సింగిల్ విండో ఇండస్టియ్రయ్రల్ పాలసీ ప్రపంచంలోనే అత్యుత్తమమైందిగా చెప్పారు. నూతన పారిశ్రామిక విధానాన్ని త్వరలో ప్రారంభించబోతున్నాం. నూతన పారిశ్రామిక విధానం అత్యంత పారదర్శకంగా ఉంటుంది. పరిశ్రమల స్థాపన కోసం ఇక నుంచి పైరవీలు చేయాల్సిన అవసరం లేదు. 10-12 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసమైన అనుమతులు ఇస్తామన్నారు. హైదరాబాద్‌లో 100 మిలియన్ యూఎస్ డాలర్ల పెట్టుబడులతో సామ్‌సంగ్ కంపెనీ హార్డ్‌వేర్ పార్క్ పెట్టేందుకు ఆస్తకి చూపుతున్నదని తెలిపారు. అనేక మల్టీ నేషన్ కంపెనీలు పెట్టుబులు పెట్టడానికి తరలివస్తున్నాయన్నారు. గీతారెడ్డి వ్యాఖ్యలపై సిఎం స్పందిస్తూ ఇక్కడి సమస్యలను పరిస్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు తెలంగాణకు విపరీతంగా అన్యాయం చేశారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. ఎన్నికల ముందు వాగ్ధానాలు ఇచ్చి మోసం చేయడం ఆంధ్రా సీఎంలకే చెల్లిందని విమర్శించారు. ఈ పునాదిరాళ్లతోనే ఓ ప్రాజెక్టు అవుఉతందని తాను అన్నమాటలను గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అలాకాదని, మాట అంటే తల తెగినా అమలు చేస్తామని అన్నారు. ఇచ్చిన హావిూ నూటికి నూరుశాతం అమలవుతుందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జహీరాబాద్‌పై వరాల జల్లు కురిపించారు. జహీరాబాద్‌కు మంచినీళ్లు ఇచ్చే ప్లాంట్‌ను తానే ప్రారంభిస్తానని కేసీఆర్ తెలిపారు. ఐటీఐ, పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు స్కిల్ డెవలప్‌మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. జహీరాబాద్ మున్సిపాల్టీకి అవసరమైన నిధులు కేటాస్తామని పేర్కొన్నారు. తనను ఇంత ఎత్తుకు పెంచిన మెదక్ జిల్లాకు జన్మంతా రుణపడి ఉంటానన్నారు. విూ నియోజకవర్గానికి అనుభవం ఉన్న ప్రజాప్రతినిధి గీతారెడ్డి, యువకులైన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ బీబీపటేల్ విూకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని సీఎం హావిూ ఇచ్చారు. వాటర్‌గ్రిడ్ ద్వారా ఏడాదిలో ఇంటింటికీ మంచినీరు అందిస్తామన్నారు. ఇక్కడి చెరువులను పునరుద్దరిస్తామని అన్నారు. నూతన పారిశ్రామిక విధానం అత్యంత పారదర్శకంగా ఉంటుందని ఆయన తెలిపారు. పరిశ్రమల స్థాపనకు ఇక పైరవీలు చేయాల్సిన పనిలేదని, త్వరలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ను అందిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. విద్యుత్ కోతలు ఉండవని, అందువల్ల పరిశ్రమలను విస్తరించుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పటికైతే విద్యుత్ కష్టాలు లేవని, భవిష్యత్లో కూడా ఆ సమస్య ఉండదన్నారు. తెలంగాణలో కరెంట్ కోతల ప్రసక్తే లేదని కేసీఆర్ అన్నారు. ఇక పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, ఈ మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ ప్లాంట్ సంవత్సరానికి 90 వేల వాహనాలను అందుబాటులోకి తేనుంది. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ మంత్రి, జహీరాబాద్ ఎమ్మెల్యే గీతారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణరావు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.