ఉద్యోగాల భర్తీ చేపడుతాం
యువత హృదయాల్లో స్థానం సంపాదిస్తాం..ఈటెల
మండలిలో పలు బిల్లులకు ఆమోదం
హైదరాబాద్,మార్చి27(జనంసాక్షి): త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టి యువత హృదయాల్లో స్థానం సంపాదిస్తామని ఆర్థిక మంత్రి ఈటెల అన్నారు. మండలిలో చర్చ సందర్భంగా మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ… పార్లమెంటరీ సెక్రటరీస్ వ్యవస్థ కొత్తదేవిూ కాదన్నారు. గతంలో ఉందని, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కూడా పార్లమెంటరీ సెక్రటరీగా పని చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్టాల్ల్రోనూ పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థ ఉందని పేర్కొన్నారు. గుజరాత్ ప్రభుత్వంలో కూడా పార్లమెంటరీ సెక్రటరీలు ఉన్నరని చెప్పారు. పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థపై వచ్చే సమావేశాల్లో నియమ నిబంధనలు తీసుకొస్తామని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు తెలిపారు. విపక్షాల సలహాలు సూచనలు కూడా స్వీకరిస్తామన్నారు. శాసన మండలిలో మార్కెట్ కమిటీ సవరణ బిల్లును మార్కెట్ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి రిజర్వేషన్ కల్పించాలని సీఎం సంకల్పించారు. ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకం అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతు బంధం పథకం కింద గోదాముల్లో రైతులు ధాన్యం నిలువ చేసుకుని ధాన్యం విలువలో 75 శాతం డబ్బు పొందవచ్చని తెలిపారు. ప్రతీ రైతు రెండు లక్షల వరకు డబ్బు పొందవచ్చని, తీసుకున్న పైసలకు ఎటువంటి వడ్డీ లేకుండా ఆరునెలల పరిమితిలో చెల్లించవచ్చన్నారు. ఉపయోగించుకున్న గిడ్డంగులకు ఎటువంటి కిరాయి చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. శాసన మండలిలో వ్యాట్ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసన మండలి ఆమోదం తెలిసింది. వాటర్ గ్రిడ్ పైప్‌లైన్ బిల్లును డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ప్రవేశపెట్టారు. దీనిపై మండలిలో చర్చ జరుగింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ… ప్రతిపక్షాలంటే మాకు గౌరవముంది. అసెంబ్లీలో బడ్జెట్ పద్దులపై సమగ్రంగా చర్చించామని అన్నారు. . ఇంటింటికి సురక్షిత మంచినీరు సరఫరా చేయడం వాటర్‌గ్రిడ్ లక్ష్యం. దేశమంతా వాటర్‌గ్రిడ్‌పై ఆసక్తి కనబరుస్తుందని తెలిపారు. ఇక పార్లమెంటరీ సెక్రటరీల బిల్లుకు తెలంగాణ శాసనమండలి ఆమోదం తెలిపింది.