ఉపకార అ వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం

వరంగల్ ఈస్ట్, ఆగస్టు 17(జనం సాక్షి)
కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ప్రతి ఏట ఒకటవ తరగతి నుంచి పీజీ కోర్సులు అభ్యసించే బీడీ కార్మికుల పిల్లలు ఉపకారవేతనాలు అందిస్తుంది 2022 -2023 సంవత్సరానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరించడానికి కేంద్ర కార్మిక శాఖ ప్రకటన జారీ చేసిందని కార్మిక శాఖ సంక్షేమ ఆస్పత్రి వరంగల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ గారు తెలిపారు. విద్యార్థులు  అధిక సంఖ్యలో స్కాలర్షిప్కు అప్లై చేసుకోవాలని అని కోరారు.  ఈ 2022 -2023 అకాడమిక్ సంవత్సరానికి ఉపకార వేతనాలు రేటు పెంచడం జరిగిందని తెలియజేశారు
 ప్రీ మెట్రిక్ కేటగిరీలో ఒకటో తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ  30 సెప్టెంబర్ 2022
 పోస్ట్ మెట్రిక్ యాదగిరిలో 11వ తరగతి మరియు ఆ పైబడిన కోర్సులు అభ్యసించే విద్యార్థులు దరఖాస్తులు చేసుకొనుటకు ఆఖరి తేదీ 31 అక్టోబర్ 2022 వివరాల కోసం 9014634511 లో అలాగే హెల్ప్ లైన్ నెంబర్  01206619540 సంప్రదించగలరు.