ఉపాధ్యాయల సమస్యల సాధనకై కృషి చేయాలి :
తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగూన్ మహేంద్ర బహదూర్ ఎంపిక
పరిగి రూరల్, అక్టోబర్ 23 (జనం సాక్షి ) :
ఉపాధ్యాయలు సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగూన్ మహేంద్ర బహదూర్ అన్నారు. వికారాబాద్ జిల్లా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిగా రంగూన్ మహేంద్ర బహదూర్ ఎంపికయ్యారు. ఈ సందర్బంగా ఆయాన మాట్లాడుతూ కొన్నేళ్లుగా అపరిషృతంగా ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తూ సమస్యలు అధిగమించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. నాపై నమ్మకం ఉంచి జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన తపస్ రాష్ర్ట, జిల్లా నాయకులకు రుణ పడి ఉంటా వారి సూచనలు, సలహాలు పాటిస్తానన్నారు.
ఫోటో రైటప్ :
23 పిఆర్ జి 02లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా రంగూన్ మహేంద్ర బహదూర్