ఉభయ సభల్లో ఉత్తరాఖండ్ ప్రకంపనలు
న్యూఢిల్లీ,ఏప్రిల్25 ఏప్రిల్25(జనంసాక్షి):
ఉత్తరాఖండ్ అంశాన్ని వెంటనే చర్చించాలని పార్లమెంట్‌లో కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. లోకసభ, రాజ్యసభలో ఇదే అంశంపై దద్దరిల్లాయి. రెండో విడత బడ్జెట్ సెషన్ ప్రారంభమైన తొలి రోజే రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులు తమ నిరసన వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చారు. ఉత్తరాఖండ్ సంక్షోభంతో తమకు ఎటువంటి సంబంధంలేదని, అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్య అని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దీనిపై చర్చకు లోక్‌సభలో కాంగ్రెస్ పట్టుబట్టింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది వారి అంతర్గత సమస్యని అన్నారు. ఉత్తరాఖండ్ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో దద్దరిల్లింది. బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం ప్రారంభంకాగానే ఉత్తరాఖండ్ అంశంపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సభ ప్రారంభంకాగానే మళ్లీ ఉత్తరాఖండ్ అంశంపై చర్చకు పట్టుపట్టడుతూ ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. దీంతో ఛైర్మన్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తోన్నట్టు ప్రకటించారు. కేంద్ర సర్కార్ ¬ష్ మే ఆవో అంటూ లోకసభలో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఖర్గేతో పాటు మరో 20 మంది సభ్యులు స్పీకర్ చైయిర్ ముందు కూర్చుని తమ నిరసన వ్యక్తం చేశారు. లోకసభలో ఉత్తరాఖండ్ అంశంపై కాంగ్రెస్ పార్టీ నేత మల్లిఖార్జున్ ఖర్గే తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఇతర పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చి వేస్తోందని ఖర్గే ఆరోపించారు. ఏప్రిల్ 28న ఉత్తరాఖండ్‌లో బలపరీక్ష జరగనుంది అని, ఆ రోజు వరకు కేంద్రం ఎందుకు వేచి ఉండలేదని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని బ్రతకనివ్వడంలేదని ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ఖరీదు చేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తుందన్నారు. ఆర్టికల్ 356ను అక్రమంగా అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.