ఉరుములతో కురిసిన భారీ వర్షం

 ఏర్గట్ల సెప్టెంబర్ 11 (జనం సాక్షి ): నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలంలోని 8 గ్రామాలలో శనివారం రాత్రి 10 గంటల నుంచి ప్రారంభమైన వర్షం భారీ ఉరుములతో వర్షం కురిసింది. దీనితో పలు గ్రామాల్లోని వాగులు వంకలు వరద ప్రవాహం తో నిండుగా ప్రవహించాయి. మండలంలోని తడపాకల్ గ్రామ శివారు నా ప్రవహిస్తున్న గోదావరి నదిలో ఎస్సారెస్పీ ప్రాజెక్ట్ నుండి విడుదలైన నీటి వరద ప్రవాహంతో నది గట్టున ఉన్న శ్రీ బాలంజనేయ స్వామీ ఆలయం  సగానికి నీట మునిగింది. ఆదివారం ఉదయం  నాటికి 87.5సాయంత్రం నాటికి 45.5శాతం వర్షపాతం నమోదు అయినట్లు సంబదిత అధికారి తెలిపారు.