ఉసుకుడికిన కేరళ అసెంబ్లీ
బడ్జెట్ ప్రవేశ పెట్టకుండా
అడ్డుకున్న విపక్షాలు
సభ వెలుపల గందరగోళం
పోలీసుల లాఠీచార్జ్
తిరువనంతపురం,మార్చి13: కేరళ శాసనసభలో కూడా కిష్కింధకాండ కొనసాగింది. శాసనసభలో ఆర్దిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టవలసి ఉంది. అయితే ప్రతిపక్షాలు వివిధ సమస్యపై నిరసన తెలిపే పనిలో భాగంగా శాసనసభ తలుపులు మూసివేసి, అదికార పక్షం లోనికి రాకుండా అడ్డుకున్నారు. స్పీకర్ చైర్ ను విసిరివేయడం, మైక్ లు విసరడం వంటి హింసాత్మక చర్యలకు వీరు పాల్పడ్డారు. కేరళ అసెంబ్లీ హై డ్రామా సాగిన ఈ వైనం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తం శాసనసభ తలుపులు మూసివేసే వరకు వెళ్లారంటే నిఘా విభాగం కూడా విఫలం చెందినట్లే అవుతుందని భావిస్తు న్నారు. కేరళ అసెంబ్లీ వద్ద ఆందోళన చేస్తున్న ప్రతిపక్షాలపై పోలీసులు విరుచుకు పడ్డారు. ఆర్థిక మంత్రి మణికి వ్యతిరేకంగా నిరసనకు దిగిన బీజేపీ కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించారు. బీజేపీ, ఎల్డీఎఫ్ కార్యకర్తలు ఆందోళనలతో అసెంబ్లీ బయట యుద్ధవా తావరణం నెలకొంది. దీంతో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు యత్నించారు. ఆందోళనకారులపై వాటర్‌కెనాన్‌లు ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో బాష్పవాయు ప్రయోగించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్‌కు పాల్పడ్డారు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు ప్రతిపక్షాలు కార్యకర్తలు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు అసెంబ్లీ పరిసర ప్రాంతాలను పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కేరళ అంసెబ్లీలో విపక్షాల ఆందోళన నేపథ్యంలో గందరగోళ వాతావరణం నెలకొంది. బార్ లైసెన్సుల్లో ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి కేఎం మణి అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపిస్తూ విపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన బాట పట్టారు. కేరళ శాసనసభలోని అన్ని ద్వారాలను మూసివేశారు. మైక్‌లు, స్పీకర్ చైర్‌ను విపక్ష సభ్యులు విసిరేశారు. విపక్షాల ఆందోళన దృష్ట్యా కేఎం మణి రాత్రంతా అసెంబ్లీలోనే ఉన్నారు. అధికారపక్ష, విపక్ష ఎమ్మెల్యే ఘర్షణతో అసెంబ్లీ బయట పెద్దఎత్తున ప్రజలు గుమికూడారు. పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న సందర్భంగా అసెంబ్లీలో హైడ్రామా చోటుచేసుకోవడం ఇదే ప్రథమని అంటున్నారు. అధికారపక్షం సభలోపలికి వెళ్లకుండా ప్రతిపక్షం అసెంబ్లీ అన్ని దారులు మూసేసింది. దీంతో అధికార, విపక్ష ఎమ్మెల్యేల నడుమ బాహాబాహీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ చైర్‌ను ప్రతిపక్ష ఎమ్మెల్యేలు విసిరేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే నిరసన హింసాత్మకంగా మారింది. పోలీసులు ఇరుపక్షాలను శాంతింపజేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది.