ఎంట్రీ టాక్స్‌ రాష్ట్రాల పరిధిలోనిది

5

కేంద్రం జోక్యం సాధ్యంకాదు

గోదావరిపై రెండో వంతెనకు మంత్రి గడ్కరీ శంకుస్థాపన

హైదరాబాద్‌/ఖమ్మం,ఏప్రిల్‌1(జనంసాక్షి): రవాణా పన్నులకు సంబంధించిన ఎంట్రీ ట్యాక్స్‌ రాష్ట్రాల పరిథిలోనిదని, ఈవిషయంలో కేంద్రం జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. తెలంగాణ రవాణ శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి గడ్కరీతో బుధవారం  ఉదయం హైదరాబాద్‌లో సమావేశమై ఆర్టీసి విభజనపై  చర్చించారు. అనంతరం మంత్రులు ఇద్దరూ విూడియాతో మాట్లాడారు. తెలంగాణకు డ్రై పోర్టు కోసం కేంద్ర కృషి చేస్తుందని గడ్కరీ చెప్పారు. భారత్‌లో  జలరవాణా మెరుగుపడటానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా మంత్రి మహేందర్‌ రెడ్డి  మాట్లాడుతూ నిబంధనల ప్రకారమే ఏపీ వాహనాలపై రోడ్‌ టాక్స్‌ విధించినట్లు చెప్పారు. ఏపీ అధికారుల వల్లే టాక్స్‌ వసూలు  ఆలస్యమైందన్నారు. రాష్ట్రం విడిపోయినందువల్లే అక్కడి వాహనాలపై పన్ను విధిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో బుధవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర మంత్రులు మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు భేటీ అయ్యారు. ఆర్టీసీ విభజన అంశంపై మహేందర్‌రెడ్డి కేంద్రమంత్రితో చర్చించారు. రవాణా పన్ను విషయంలో చట్టప్రకారమే వెళ్తున్నామని  మంత్రి మహేందర్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం రూ.40 కోట్లు నష్టపోయిందని వివరించారు. కోర్టు ఆదేశాలను గౌరవించి ఇప్పటి వరకు ఆగామన్నారు. త్వరలోనే ఆర్టీసీ విభజన పూర్తవుతుందని, దీనిపై కేంద్రమంత్రి గడ్కరీతో చర్చించామని వెల్లడించారు. ఆర్టీసీ ఆస్తుల వివాదం పరిష్కారమవుతుందని భావిస్తున్నాం, ఆర్టీసీ ఆస్తులపై షీలాబేడీ కమిటీ నివేదిక మేరకు ముందుకెళ్తామని పేర్కొన్నారు. రవాణా పన్ను విషయంలో చట్టప్రకారమే వెళుతున్నామని  మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈ విషయంలో కోర్టు ఆదేశాలను గౌరవించి ఇప్పటికి వరకు ఆగామని, పేర్కొన్నారు. త్వరలోనే ఆర్టీసీ విభజన పూర్తవుతుందని, ఉదయం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో ఈ విషయం చర్చించామని చెప్పారు. ఆర్టీసీ ఆస్తుల వివాదం పరిష్కారమవుతుందని తెలిపారు.

మరోవైపు ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరిపై వంద కోట్లతో నిర్మించనున్న రెండో వంతెనకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్‌గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఇప్పుడున్న వంతెన ఇరుకుగా మారడంతో పాటు దీనిపై భారం పెరగడంతో దీని అవసరం ఏర్పడింది. అదేవిధంగా పెనుబల్లి దగ్గర 221 వ జాతీయ రహదారికి శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని రహదారులపై ప్రత్యేక దృష్టిసారిస్తామని ఈ సందర్భగా నితిన్‌గడ్కరీ స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం వీఎం బంజారా వద్ద విజయవాడ-జగదల్‌పూర్‌ జాతీయరహదారి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ మాట్లాడారు. నదులపై 101 జలమార్గాలను ఏర్పాటు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. రానున్న రోజుల్లో రివర్‌పోర్టులు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రివర్‌పోర్టుల ద్వారా ప్రయాణికులు, పారిశ్రామిక ఉత్తత్తులు రవాణా చేయనున్నట్లు వివరించారు. వారణాసిలో త్వరలో జలమార్గం అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. రోడ్డుపై రూ.1.5, రైలు మార్గంలో రూ.1, జలమార్గంలో 50పైసలే ఖర్చవుతుందన్నారు. రాష్ట్ర నివేదిక అందగానే ఖమ్మం జిల్లాకు డ్రై పోర్టు, వాటర్‌ పోర్టు ప్రతిపాదనలు పరిశీలిస్తామన్నారు. జలమార్గాలను అభివృద్ధి చేయడం బీజేపీ ప్రధానమైన లక్ష్యమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో రివర్‌ పోర్టులను ఏర్పాటు చేస్తామన్నారు. వీటి ద్వారా ప్రయాణికులు,పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా చేయోచ్చని పేర్కొన్నారు. దేశంలో 5 జలమార్గాలకు రూపకల్పన చేశామన్నారువారణాసిలో గంగానదిపై త్వరలో జలమార్గం అందుబాటులోకి తెస్తామని తెలిపారు. . జలమార్గం ద్వారా పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా వల్ల ఖర్చు చాలా తగ్గుతుందని తెలిపారు.సిమెంట్‌తో జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టే విధంగా కేంద్రం సంస్కరణలు తీసుకువస్తుందని తెలిపారు. ఇందుకోసం 107సిమెంట్‌ కంపెనీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. ఈమేరకు కేంద్రం వద్ద రూ.95 లక్షల టన్నులకుపైగా సిమెంట్‌ అందుబాటులో ఉందని వెల్లడించారు.  అంతకుముందు కేంద్రమంత్రి గడ్కరీ భద్రాచలం సీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఏపీ వాహనాలపై పన్ను వేయడం అనేది తెలంగాణ రాష్ట్ర పరిధిలోనిదని  కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.